Thursday, September 15, 2022

దైవానుభూతిని గురించి తెలుసుకుందాం.

 దైవానుభూతిని గురించి తెలుసుకుందాం. 

తీగలో ప్రవహించే విద్యుత్తు కంటికి కనిపించదు. కానీ విద్యుత్ దీపంలోని కాంతి తీగలో ప్రవహించే అదృశ్యశక్తిని తెలియజేస్తుంది. అదేవిధంగా భక్తి విశ్వాసాలనే తీగల ద్వారా భగవంతుడి అభయం అంతర్లీనంగా ప్రసరిస్తూ ఉంటుంది.

భగవత్కటాక్షం పొందడం అంత సులభం కాదు. దేహానికి ఆహారం ఎంత అవసరమో, దైవానుగ్రహానికి నిరంతర ప్రార్ధన, శరణాగతి అంతే అవసరం. భగవంతుడి ముందు సదా వినయం, విధేయత కలిగి ఉండటమే సాధన. మన చుట్టూ గాలి ఉన్నా దాన్ని మనం చూడలేం. ఆకులు కదిలినప్పుడు మాత్రమే గాలి. ఉనికి మనకు తెలుస్తుంది. ఆ అనుభూతిని భగవంతుడిగా భావించిన వారే. ఆయన సృష్టించిన ప్రకృతిలో ఆయనను దర్శించగలుగుతారు. కనిపించే ప్రకృతే, కంటికి కనిపించని భగవంతుడి ఆకృతి. ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించడం ద్వారా దైవ సన్నిధిని అనుభూతి చెంచాలి.

చిన్న చీము నడక నుంచి నక్షత్ర మండల పరిభ్రమణం వరకు సృష్టిలోని ప్రతి
కదలికలో అద్భుతాలు బాగున్నాయి. అద్భుతాల వెనక అదృశ్యంగా కంటికి
కనిపించని భగవత్ శక్తి ఉంటుంది.
అంతర్దృష్టి అలవరచుకున్నప్పుడే
సృష్టిలోని అద్భుతాలు అనుభవంఅవుతాయి. చిన్న గడ్డిపరకలో ఏ
చైతన్యం ఉంటుందో, న్యూటన్
మహా మేధలోనూ అదే చైతన్యం
దాగుంటుందని గ్రహించగలుగుతాం.
జననంతో పాటు మరణం ఉంటుందని గ్రహించగలిగితే, సుఖం వెనకే దుఃఖం తెలుసుకోవడం తేలిక. ఉంటుందని
ద్వంద్వత్వ సృష్టి లక్షణం. జననం-మరణం పగలు రాత్రి, మంచి-చెడు, సుఖం దుఃఖం, ప్రేమ ద్వేషం వంటివి ప్రకృతి స్వభావాలు,
"విత్తనం భూమిలో నాటినప్పుడే అంకురం భూమిని చీల్చుకుని వెలుగులోకి వస్తుంది. పరస్పర వైరుధ్యాల మధ్య వారభే ఆధ్యాత్మికత. దీన్ని విస్మరించి అంతా తన ప్రతిభే అనే భ్రమలో మనిషి జీవిస్తున్నాడు. సుఖాన్ని ఆస్వాదిస్తున్నంత తేలికగా, కష్టాన్ని అంగీకరించలేక పోతున్నాడు. జీవించడం అంటే ఏమిటో తెలియకుండానే యాంత్రిక జీవితం గడుపుతున్నాడు. ధృతజ్ఞత స్థానంలో కృతఘ్నత, వినయం స్థానంలో విధ్వంసం, అనురాగం స్థానంలో అసూయ, ప్రేమ స్థానంలో ద్వేషం ప్రదర్శిస్తూ సహజ లక్షణాలకు దూరం అవుతున్నాడు.

విజ్ఞానపరంగా అభివృద్ధి చెందినంత మాత్రాన ఆధ్యాత్మికత, దైవ చింతనలకు దూరం కావాలా! అతీతమైనది. శాశ్వతమైనది ఏమిటో తెలియనిది అయిన సత్యం పక్కన చోటు సంపాదించడమే ఆధ్యాత్మిక లక్ష్యం కావాలి. అందుకోసం ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. అది నీతోనే ఉంది. దానికి కావలసిన శక్తి దైవం రూపంలో నీలోనే ఉంది. నీలోని దైవాన్ని నువ్వు నీ మార్గంలో అన్వేషించడమే అసలైన ఆధ్యాత్మిక సాధన దానికి పరమసత్యమైన భగవంతుడి మీద శ్రద్ధ, ఆధ్యాత్మిక ఆదర్శాలపట్ల విశ్వాసం, శరణాగతులే సాధనాలు.

ప్రహ్లాదుడు ప్రార్ధిస్తే నారసింహుడు. ద్రౌపది వేడుకుంటే శ్రీ కృష్ణుడు, గజేంద్రుడు ఆర్తనాదం చేస్తే శ్రీహరి ఉన్న పశాన వచ్చి కాపాడటం దైవ నిదర్శనాలు, జీవన గమనంలో ప్రమాదం ప్రమాదం రెండూ సంభవిస్తాయి. ప్రమాదాన్ని కూడా ప్రమోదంగా మార్చుకోవాలి. అది ఆధ్యాత్మిక సాధన ద్వారానే సాధ్యమవుతుంది.

'అందరి హృదయాలకూ ఆధిపతివైన ఓ ప్రభూ! నేను నీకు నిజం
చెబుతున్నాను. నా మనసు నుంచి కామం వంటి మలినాల్ని తొలగించు. నా
హృదయాన్ని నీ శాశ్వతమైన ధామంగా చేసుకో" అని ప్రార్ధించాడు. తులసీదాసు

సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment