🙏🏽🙌🏿 లక్ష్మిశ్రీవేంకటేశ్వరస్వామి జ్ఞానపీఠం రేణిగుంటరోడ్డు.తిరుపతి
వ్యవస్థాపకులు .ధర్మఛారౄ
'తిరుపతి' శ్రీనివాసరావు
కర్మయోగి..ప్రధాన నిర్వహకులు
9390216263..9550804092 🙏🏽🙌🏿🌹🙊🙉🙈 🌹🙌🏿
🌺🍃🌸🍃🌺🍃🌸🍃🌺
🌹నేటి ఆత్మ విచారం.🌹
ఈ మానవ జన్మ మళ్లీ మళ్లీ వచ్చేటటువంటిది కాదు.
ఈ ప్రాణమూ దేహమూ శాశ్వతంగా ఉండిపోవు కూడా.
ఇది మాయామయమగు లోకము కనుక ఇక్కడ దొరికే సుఖాలు కూడా మాయతో కూడినవే!
ఇది స్వార్థపూరితమైన ప్రపంచం కనుక ఇందులో ఉండే బంధాలన్నీ స్వార్థపూరితమైనవే!
ఇక్కడ మనదంటూ బయట ఏదీ లేదు. మనదంటూ ఏదైనా ఉందంటే అది మన లోపలే ఉంటుంది. అదియే ఆత్మానందము.
ఈ ఆత్మానందము చిక్కవలెనంటే పరలోకమునందే! పరలోకమనగా ఎక్కడో ఆకాశం పైన లేదు! మనలోనే ఉంటున్నది.
కుండలో పాలుపోసి కవ్వముతో బాగుగా చిలికినపుడు వెన్న రావడం జరుగుతుంది.
అదే విధముగా మనస్సును భగవన్నామమనే కవ్వంతో బాగా చిలకాలి. అపుడే ఆత్మానందమనే వెన్న లభిస్తుంది.
ఆధ్యాత్మిక జీవనంలో కూడా ఉన్నత స్థాయికి చెందినవారు కొందరుంటారు. గొప్పగొప్ప ఋషులు, మునులు, సాక్షాత్కారం పొందిన మహనీయులు ఈ కోవకు చెందుతారు.
కానీ ప్రాపంచీకులు, భాగ్యవంతులు అయిన ఉన్నత వర్గాలు ధనాన్ని దాచుకున్నట్లు వీరు తమ ఆధ్యాత్మిక సంపదలను దాచుకోరు. పైగా తాము అనుభవిస్తున్న సంపదలను ఇతరులకు అందించడంలో ఎంతో ఆనందిస్తారు.
అయితే సామాన్య ప్రజానీకంలో బహు కొద్దిమంది మాత్రమే ఆ సంపదల గురించి పట్టించుకోవడం దురదృష్టకరం.
చాలామందికి ఆధ్యాత్మిక సౌధాల వెచ్చదనపు హాయి రుచించదు. తమ మురికికూపాలలో దొర్లడాన్నే వారు ఇష్టపడతారు.
గుర్రాన్ని నీటి వద్దకు తీసుకువెళ్ళవచ్చు కానీ దానికి ఇష్టం లేకుండా నీరు త్రాగించలేం కదా.
కాబట్టి మన చుట్టూ ఎంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నారో చూడవలసిన పనిలేదు. ఆ ఉన్నతమైన ఆదర్శపు అభిరుచి మీకు అందితే, మీరు దానిని అనుసరించి, దానికి కావలసిన నియమాలను పాటించాలి.
ఆ ఆదర్శాన్ని ఇతరులు ఖాతరు చేయకపోతే దానిని గురించి మనం చేయగలిగింది ఏమీ లేదు.
ఆధ్యాత్మిక జీవనం కొఱకు అందరూ (ప్రాపంచీకులు) పయనించే మార్గంలో కాకుండా మనం వేరే త్రోవ ఎంచుకోవడం తప్పనిసరి. మనుష్యజన్మ, మోక్ష కాంక్ష, మహాపురుషుల సాంగత్యం ఈ మూడూ మనిషికి లభించడం ఎంతో దుర్లభం. భగవంతుడి అనుగ్రహం ఉంటే తప్ప ఇవి లభ్యం కావు.☝
🌺🍃🌸🍃🌺🍃🌸🍃🌺
No comments:
Post a Comment