Thursday, September 15, 2022

🎻🌹🙏బాల శబరి - భక్త శబరి..!!

 🎻🌹🙏బాల శబరి -  భక్త శబరి..!!
            
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿శబరి ఒక కోయజాతి పిల్ల. వయసు ఎనిమిది  సంవత్సరాలు. అడవిలో నివాసం. 

🌸అంత చిన్న వయసు పిల్లకు పెళ్ళిచేయదలిచాడు ఆమె తండ్రి.
ఆ సందర్భంగా పెళ్ళివారికి విందు చేయడంకోసం సజీవంగా ఉన్న వంద  మేకలను  ఇంటి చుట్టూ కట్టివుంచాడు.

🌿వాటిని చూసి శబరి  తండ్రిని ఆడిగింది. " రేపు నీకు పెళ్ళి. వచ్చే అతిధులకు విందు చేయడానికే యీ మేకలు" అని చెప్పిన తండ్రి అది విని శబరి భయాందోళనకు గురియైంది. 

🌸తమ సంతోషంకోసం ,ఆకలి తీర్చుకోవడం కోసం జీవహింస తగదని  వాటిని  చంపవద్దన్న శబరి మాటలను, చిన్న పిల్ల మాటలుగా జమకట్టి, ఆమెను లెక్క చేయకుండా తండ్రి అక్కడనుండి వెళ్ళి పోయాడు. 

 🌿రేపు తన పెళ్ళికోసం చావబోతున్న ఆ అమాయక జీవాలను చూస్తూ వుంటే బాల శబరి మనసు ద్రవించి పోయినది. ఏం చేస్తే ఈ మేకల ప్రాణాలు దక్కుతాయి  అని ఆలోచిస్తూ , ఎవరి కంటపడకుండా వెంటనే ఇల్లు వదలి వెళ్ళి పోయింది.

🌸అలా ఎంతో దూరం నడచి నడచి అలసి పోయింది. పూర్తిగా డస్సిపోయి
గంగాతీరానికి వచ్చిన శబరి  దోసెడు గంగాజలం త్రాగింది. 

🌿సమీపమున
మతంగ మహర్షి  ఆశ్రమం వున్నది.  శబరికి అది ముని ఆశ్రమమని తెలియదు.  అలసిపోయి కాళ్ళు ముందుకు సాగక ఆశ్రమ వాకిలిలో పడుకుని నిద్రపోయింది.

🌸సూర్యోదయానికి ముందే లేచి తాను ముందు రోజు నీళ్ళు త్రాగిన గంగ వద్దకు స్నానానికి వెళ్ళింది. 
మార్గం అంతా అడవి  ముళ్ళు , డొంకలతో నిండి వుంది.

🌿అరుణోదయకిరణాల
వెలుగులో దోవలోని ముళ్ళను తొలగించుకుంటూ , మార్గాన్ని శుభ్రపరుస్తూ
గంగా తీరం చేరుకుంది. 

🌸ఆశ్రమంలోని మతంగ మహర్షి ప్రాతఃకాలమున లేచి, గంగలో స్నానం చేయడానికి  బయలు దేరి వెళ్ళాడు.  మార్గమంతా చెత్తా, చెదారం  లేకుండా శుభ్రంగా వుండడం చూసి శిష్యులను అడిగాడు. 

 🌿అప్పుడు ఒక శిష్యుడు
" ఆచార్యా! నిన్న సాయంకాలం ఒక బాలిక మన ఆశ్రమ వాకిలి వద్దకు వచ్చి నిద్ర పోయినది.  

🌸ఉదయాన లేచి మార్గాన్ని శుభ్రపరచి
ఇప్పుడు గంగలో స్నానం చేస్తున్నది. అని తెలిపాడు

🌿గంగ ఒడ్డుకి వెళ్ళిన మహర్షి, ఆ బాలికను చూడగానే  విస్మయం చెందాడు. భవిష్యత్ లో ఆ బాలికకు కలగబోయే అదృష్టానికి అబ్బురపడ్డాడు.  

🌸జ్ఞానదృష్టి గల మతంగముని ,మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని దర్శనం చేసుకొనే భాగ్యశాలియని అని తెలుసుకున్నాడు.
 
🌿శిష్యులను పంపి ఆ బాలికను పిలిపించాడు.  తాను నిద్రించిన ఆశ్రమం మతంగ మునిదని తెలుసుకున్నది బాలిక. 

🌸భయభక్తులతో మహర్షి దగ్గరకు వెళ్ళి  కాళ్ళమీద పడి" ఆచార్యా! ఇది
మీ ఆశ్రమమని తెలియక నిద్ర పోయాను. మన్నించండి. 

🌿ఈ దాసురాలి పేరు శబరి. 
నా తండ్రి నాకు పెళ్ళి చేయదలచి విందు కోసం వంద మేకలను 
చంపాలని నిశ్చయించాడు.

🌸జీవహింస మహా పాపం. నా తండ్రి ఆ పాపం చేయడం  నాకు ఇష్టము లేదు  అందు వలన నేను ఇల్లు వదలివచ్చేశాను.

🌿ఇంక నేను వెడతాను ఆచార్యా! "అని బయలుదేరుతున్న
ఆమెను ఆపుచేశాడు మహర్షి. 

🌸బాలా..శబరీ ! నీవు నా ఆశ్రమానికి రావడం నా భాగ్యం .  చాలా కాలం తర్వాత శ్రీ మహావిష్ణువు ఇక్ష్వాకుల వంశంలో  శ్రీ రామునిగా  అవతరించబోతున్నాడు.

🌿ఆ అవతార పురుషుని దర్శనంతో నీ జన్మ పునీతమవుతుంది. అంతవరకు 
నీవు నా ఆశ్రమంలోనే 
నివసించు.  ఈనాటి నుండి సదా 
శ్రీ రామనామాన్ని జపించు.  

🌸అవతార పురుషుడైన
శ్రీరాముడే ఈ ఆశ్రమానికి వచ్చి నీకు దర్శన భాగ్యం కలిగిస్తాడు. "  అని అన్నాడు మహర్షి. ఆచార్యుని దివ్యవాక్కులకు బాల శబరి పులకించిపోయింది.

🌿ముని పాదాలకి భక్తితో వందనం చేసినది. ఆనాటినుండి శబరి ముని వాటికలోనే పరమ పవిత్రంగా శ్రీరామ నామాన్నే  జపిస్తూ శ్రీరాముని దర్శనానికై ఎదురు చూసింది.  

🌸శబరి కోరిక నెరవేరింది.
శ్రీరాముడు ,లక్ష్మణ
సమేతుడై తన ఆశ్రమానికి వచ్చాడు.

🌿 ఎప్పుడు వచ్చాడు?
బాల శబరి ,కన్యయై , యువతిగా మారి , ప్రౌఢ వయసుదాటి , వృధ్ధాప్యం మీదపడి ఒడలంతా ముడతలుపడి , తలముగ్గుబుట్టగా మారి ,  

🌸దృష్టి క్షీణించి లేచి నడవలేని స్థితిలో వున్నప్పుడు శ్రీరాముడు శబరికి దర్శనభాగ్యం కలిగించాడు. ప్రేమతో ,భక్తితో ఆమె రుచి చూసి పెట్టిన ఎంగిలి పండ్లను భుజించి శబరిని ధన్యురాలిని చేశాడు. 

🌿వృధ్ధ శబరి భక్తి తత్పరతను లోకానికి విదితం చేశాడు శ్రీరాముడు.
శ్రీరాముని  దర్శనంతో , స్పర్శతో వృధ్ధ శబరి తన యావజ్జీవ కష్టాలు, వేదన , ఎదురు చూపులు అన్ని మరచిపోయి రాముని సన్నిధిలో పునీతురాలయింది...జై శ్రీరాం..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment