Monday, September 12, 2022

☘️🪷💦🌻🌹🌈

 ప్రతి ఒక్కరూ ఆనందం కావాలని కోరుకుంటారు, కష్టాలను కావాలని ఎవరూ ఆశించరు. 

 ఆనందం వల్ల పొందే ఫలితాలు, సుఖాలు కోరదగినవి,ఆనందించదగినవి.
 కానీ... 
 కష్టాలకు ఎదురీది పొందే ఫలితాలు అద్భుతమైనవి, అభినందించదగినవి. 
 అర్థం చేసుకుంటే- ఆనందంగా ఉన్నంత మాత్రాన భయాలు, బాధలు, చీకూ చింతలు లేకుండా ఉండవు. 
 కష్టాలు అనుభవిస్తున్నంత మాత్రాన ఓదార్పు, ఆశలు, అవకాశాలు, ఆనందాలు ఉండకుండా పోవు.నిజానికి కష్టకాలంలోనే వ్యక్తి పట్టుదల, ప్రతిభా పాటవాలు బయటపడ తాయి. 

 గాలిపటం ఎదురు గాలిలోనే పైపైకి ఎగురు తుంది,కేవలం సుఖాలు మాత్రమే కావాలనుకోవడం అవివేకం.

 కష్టాలు లేకపోతే సుఖాల కష్టానికి విలువ తెలియదు.అలవాటు పడిన వాడు సుఖాన్ని ఆనందంగా స్వీకరించగలడు. 

 కానీ... సుఖానికి అలవాటు పడ్డవాడు కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కో లేడు. 

 కష్టాలు,సుఖాలు కూడా వ్యక్తిత్వానికి గీటురాళ్లు కాబట్టి కష్టాలు నీ దృఢత్వాన్ని పరీక్షిస్తాయి. సుఖాలు నీలోని బలహీనతలను పరీక్షిస్తాయి. 

 వాటిని సద్వినియోగం చేసుకోవడంలోనే మన వ్యక్తిత్వం,విజ్ఞత తెలుస్తాయి..

 🌄శుభోదయం🌞 

☘️🪷💦🌹🌻🐔

No comments:

Post a Comment