Tuesday, September 6, 2022

నిశ్శబ్ధాన్ని వినటం సాధ్యమవుతుందా ? ఎలా !?

      💖💖 *"315"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖


*"నిశ్శబ్ధాన్ని వినటం సాధ్యమవుతుందా ? ఎలా !?"*
************************

*"శబ్ధస్వరూపం అర్ధమైతే నిశ్శబ్ధం అనుభవంలోకి వస్తుంది. ప్రతి 'ధ్వని' వెనుక ఒక నిశ్శబ్ధం దాగి ఉంది. ఇక్కడ నిశ్శబ్ధం అంటే శబ్ధంలేనిస్థితి మాత్రమే కాదు. శబ్దానికి కారణమైన స్థితి అని అర్ధం. శబ్ధం మారినట్లు కనిపించినా ఆ శబ్ధంలో మార్పులేనిస్థితి ఒకటి ఉంది. ఆ మార్పులేనిస్థితిని నిశ్శబ్ధం అంటారు. అంటే నగ రూపంలో కనిపించినా బంగారంలో ఎలాంటి మార్పులు లేనట్లే, ఈ సృష్టి అంతా ఉన్న చైతన్యంలోని మారని స్థితి నిశ్శబ్ధంగా తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవటమే జ్ఞానం. నోరు ఎన్ని మాటలు మాట్లాడినా, దాని స్థితిలో మార్పులేదు. గంట ఎన్ని నాదాలు చేసినా దాని స్వరూపంలో మార్పులేదు. పిల్లనగ్రోవి శబ్ధం శ్రావ్యమై పాటగా వినిపించినా, ఆ శబ్ధంలో వచ్చిన మార్పు ఏదీలేదు. మన ప్రతి అనుభవం నిశ్శబ్ధంగానే ఉంది. ఆ అనుభవాన్ని వ్యక్తంచేసే ప్రయత్నమే శబ్ధకాలుష్యంగా ఉంది. అంటే మన ఆలోచనే తొలి శబ్ధంగా ఉంది. పాటలోని సాహిత్యంలో అక్షరాలు వేరైనా ఆ పాటంతా ఉండే స్వరం ఒక్కటే. అదే నిశ్శబ్ధం. ఇలా మారినట్లుగా కనిపించే ప్రతి విషయం వెనుక, మార్పులేని సత్యం ఒకటి ఉంది. అదే నిశ్శబ్ధం. ఆ నిశ్శబ్ధాన్ని వినగలగటమే ధ్యానం. అదే నిశ్శబ్ధ శబ్ధం.. శబ్ధ నిశ్శబ్ధం !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
           

No comments:

Post a Comment