Sunday, September 25, 2022

యోగాభ్యాసులకు కావలసిన నియమావళిని తొలిసారిగా తెలిపిన గ్రంధం “భగవద్గీత”

 ఓమ్!
యోగాభ్యాసులకు కావలసిన నియమావళిని తొలిసారిగా తెలిపిన గ్రంధం “భగవద్గీత” భగవద్గీత ఆరవ అధ్యాయము లో యోగం నేర్చుకునే వారికి ఉండవలసిన లక్షణములు ఈ క్రింది విధంగా చెప్పబడ్డాయి . 
నాత్యశ్నతస్తు యోగోస్తి న చైకాంత మనశ్నతః
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున II 6-16 II
ఓ అర్జునా ! అతిగా భుజించు వానికి , ఏ మాత్రము భుజించని వానికి , అతిగా నిద్రించు వానికి , ఎల్లపుడూ (ఏ మాత్రము నిద్రింపక ) మేల్కొని యుండు వానికి యోగము సిద్ధించదు . 

యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు
యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఖః హా II 6-17 II

ఆహార విహారాదులయందును , కర్మాచరణములయందును , జాగ్రత్త స్వప్నాదులయందును, యధాయోగ్యముగా ప్రవర్తించువానికి దు:ఖనాశకమగు, ధ్యానయోగము సిద్ధించును . 
మనం యోగా ఎందుకు నేర్చుకోవాలి ?  
మనం యోగాను “ఆరోగ్యం” కోసం నేర్చుకుందాము అనుకుంటున్నాము . యోగా యొక్క అంతిమ లక్ష్యం ఆరోగ్యం కాదు . అంతిమ లక్ష్యం “భగవస్సాక్షాత్కారం” . అయితే మనకు ముందుగా భగవంతుడు గురించిన ఆలోచన కన్నా మన శరీరానికి సంబంధించిన ఆలోచనలూ , మనమూ .. మన జీవిత భాగస్వామి .. మన పిల్లలూ .. మన కుటుంబం ఇదే రకమయిన ఆలోచనలు తో సతమతం అవుతూ ఉంటాము . ఈ ఆలోచనలనుండి బయట పడడం చాలా కష్ట సాధ్యం అయిన పని . అందుకు ఎంతో సాధన కావాలి , ఎంతో కాలం , పట్టుదల కావాలి . ఆదిశగా మనలను నడిపించేదే యోగం . యోగా ద్వారా మనం ముందుగా మన శారీరక సమస్యలనుండి బయట పడడం జరిగితే మన మనసులో ఒక పరివర్తన వస్తుంది . ఆ పరివర్తన కలగడమే “యోగం”   

యోగం అంటే కలయిక . 
 మన శరీరం మన మనసుతో కలవాలి 
మన మనసు మన బుద్ధితో కలవాలి  
మన బుద్ది మన ఆత్మతో కలవాలి  
మన ఆత్మ మన పరమాత్మ తో కలవాలి 
ఇది ఎలా సాధ్యపడుతుంది ? 
అందుకు మనం చెయ్యవలసినది “ప్రాణాయామం”
యోగం అనేది ఒక ప్రక్రియ కాదు ఒక జీవన శైలి . మన పూర్వీకులు యోగాకు ఎనిమిది అంగములు ఉన్నాయి అంటారు .  
అవి  యమము  నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారం
ధారణ ధ్యానం  సమాధి
ఇవి అన్నీ ఆచరించినవాడు దైవసమానుడు . దైవ దర్శనం చేసిన అనుభూతిని ప్రతి క్షణం అనుభవించగలడు. ఈ విషయాలను నేను అధికంగా ఈ పుస్తకం లో పేర్కొనడం లేదు . 
యమము అనగా ఇంద్రియ నిగ్రహము. 
అహింసా సత్యాస్తేయా బ్రహ్మచర్యా పరిగ్రహా యమాః 
  అహింససత్యముఅస్తేయము (మనో వాక్కాయ కర్మలచేత పర ద్రవ్యమునందు కోరిక లేకుండా ఉండుట)దొంగిలింపకుండుటబ్రహ్మ చర్యము
2. నియమము : 
శౌచ సంతోష తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః
నియమముశౌచంసంతోషముతపస్సుస్వాధ్యాయముఈశ్వర ప్రణిధానము నియమములు 
3.ఆసనం
పతంజలి చెప్పిన "ఆసనం" అంటే మనస్సును ఆత్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే "స్థిర సుఖాసనం" అన్నారు. ఇవి ఎన్ని అనే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు .
 
4. ప్రాణాయామంశ్వాసను క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. బాబా రామ్ దేవ్ గారు శరీర ఆరోగ్యం దృష్ట్యా ఎనిమిది రకాల ప్రాణాయామాలు అందరూ చెయ్యాలని చెబుతున్నారు 
5. ప్రత్యాహారం
ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల నుండి దృష్టి నిగ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారము.
6. ధారణధారణ అంటే బ్రహ్మమును (ఈశ్వరుని అనుకోవచ్చు) హృదయపద్మములో ధరించుట. 
7. ధ్యానముఈశ్వరుని గురించిన చింతలో ఉండుటయే ధ్యానము. 
8. సమాధిఅహంబ్రహ్మాస్మి (నేనే ఆ బ్రహ్మమును) అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.  
మనం మన శరీర ఆరోగ్యం కోసం , మానసిక ప్రశాంతత కోసం ఎనిమిది విధాలు అయిన ప్రాణాయామాలనూ వివిధ రకాల ఆసనాలనూ ఈపుస్తకం ద్వారా నేర్చుకుందాం . అంతే కాకుండా వివిధ వ్యాధులకు చేయవలసిన ప్రాణాయామ పద్ధతులూ , ప్రత్యెక ఆసనాలూ , గ్రుహోపచారాలూ , ఆక్యుప్రెషర్ , ఆయుర్వేద మందుల గురించి ఈ పుస్తకం ద్వారా మీకు అందించాలని , పరమ పూజ్య బాబా రామ్ దేవ్ గురు మహారాజ్ హిందీ లో అందించే విషయాల తెలుగు భాషీకరణ ఈ పుస్తకం . 
రండి మనం యోగసాధనకు ఉపక్రమించడం ఎలాగో తెలుసుకుందాం .
మన మనసు ఎపుడూ ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తూనే ఉంటుంది . మన ఆలోచన ఫలితమే మన వ్యక్తిత్వం. ఒక మనిషిని మంచివాడుగా, దొంగగా, ఉగ్రవాదిగా, సాత్వికుడుగా, ఋషిగా రూపొందించేవి అతని ఆలోచనలే. దీనికి మూలకారణం మనస్సు . దీనినే చిత్తం అంటారు. చిత్తాన్ని మంచి వైపు మళ్లించే సాధనమే యోగం.
.
మనం జీవించి ఉన్నామనడాని కి కారణం శ్వాస పీలుస్తూ ఉండడం . . శ్వాస ఆగిపోతే ప్రాణం పోయింది అంటాం. అంటే మనం పీల్చే గాలి ప్రాణం అన్నమాట. ప్రాణం యొక్క ఆయామమే (విస్తరించడం , నియంత్రించడం ) ప్రాణాయామం.
.
మనం యోగసాధనకు ఉపక్రమించడం ఎలాగో తెలుసుకుందాం .
.
.
ప్రాణాయామం ఖాళీ కడుపుతో చెయ్యండి. అంటే ఉదయం చాలా మంచిది. కుదరనివారు భోజనం చేసిన నాలుగు లేదా అయిదు గంటల తర్వాత సాయంత్రం చెయ్యండి. కాఫీ త్రాగిన అరగంట తరవాత చెయ్యండి.
.
శరీరం నేలకు తగలకుండా ఏదయినా దుప్పటి వంటి దానిపై గానీ, రబ్బరు షీట్ పై గానీ కూర్చుని నిటారుగా వెన్నెముక ఉండేలా కూర్చుని సాధన చెయ్యండి . మనం స్థిరంగా సుఖంగా కూర్చోవాలి 
.
కూర్చునే పద్ధతులు 
.
పద్మాసనం , సిద్ధాసనం , వజ్రాసనం , సుఖాసనం , స్వస్తికాసనం , దండాసనం , ఇలా ఎదో ఒక ఆసనం లో కూర్చోండి . అలా కూర్చోలేక పోతే కుర్చీలో కూర్చుని గానీ , మంచం మీద పడుకుని కూడా మీరు ప్రాణాయామం చెయ్యవచ్చు . 
.
,
మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. శక్తికి మించి చెయ్యకండి. రోజురోజుకూ శక్తి పరుగుతుంది. అసిపోయినపుదు ఆగి విశ్రాంతి తీసుకోండి. లేదంటే కొన్ని సూక్ష్మ వ్యాయామాలు చెయ్యండి. ఒక్కరు సాధన చేయడం కష్టం కనుక కనీసం ఐదారుగురు కలిసి చెయ్యండి . శ్వాసక్రియను ముక్కుతో మాత్రమే చెయ్యండి. 

No comments:

Post a Comment