💖💖💖
💖💖 *"332"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"జగత్తుమిథ్య అని పెద్దలు చెబుతున్నారు ఎలా అర్ధం చేసుకోవాలి ?"*
**************************
*"మిథ్య అంటే లేనిదని అనుకుంటాం. వస్తువు ఉన్నా నీ మనసులో కోరిక లేకపోతే, ఆ వస్తువు లేనట్లే లెక్క. వస్తువు ఎదురుగా లేకపోయినా నీ మనసులో కోరిక ఉంటే అది ఉన్నట్లే. జగత్తుమిథ్య అంటున్నది దాని వల్ల కలిగే బాధ గురించే కానీ విషయం గురించి కాదు. మనకి జీవితంలో కోరిక లేకపోతే ఏ బాధలేదు. బాధలేకపోతే మిథ్య అన్న మాటేలేదు. కోరిక వల్లనే ఈజగత్తును మిథ్యగా భావించాల్సి వస్తుంది. జాగృతిలో మనం ఏది అనుభవించాలన్నా మనతోపాటు మరొక వస్తువు కావాలి. కానీ కలలు అనుభవించడానికి మన మనసే తాను ద్విపాత్రాభినయం చేసి అనుభవాలను పొందుతుంది. ఇలలో, కలలోనైనా మనం పొందే అనుభవాలు ఒకేలా ఉంటాయి. అలాంటప్పుడు జాగృతిలోనే మనకి అనుభవాలనిచ్చే ఈ జగత్తుపై కోరికలు అవసరమా ? జాగృతిలో ఏర్పడిన కోరికలే కలలో కూడా మనని అనుభవాలు కోరుకునేలా చేస్తున్నాయి. ఇలలో, కలలోనూ మనకి బాధలు పంచే కోరికలను తొలగించుకోవటం శాంతికి సోపానం !"*
*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
No comments:
Post a Comment