Tuesday, September 27, 2022

ధ్యానం పేరుతో పొందే 'శాంతి' అంతకుముందే మనసులోనే ఉంటుంది కదా ! అప్పుడే ఎందుకు తెలియబడటం లేదు ?

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
    
*"ధ్యానం పేరుతో పొందే 'శాంతి' అంతకుముందే మనసులోనే ఉంటుంది కదా ! అప్పుడే ఎందుకు తెలియబడటం లేదు ?"*
*******

*"మనసు యొక్క నిజస్వరూపమే శాంతి. నిజానికి ధ్యానం పేరుతో పొందే శాంతి మనసు పొందాల్సిన మరో క్రొత్త స్థితి కానీ గుణం కానీ కాదు. ఇతర గుణాలతో కలుషితం కాకుండా మనసును కాపాడుకునే సాధనే ధ్యానం. ప్రశాంతత మినహా మరేదీ వద్దనిపించడమే మనస్సు పొందే నిజమైన ధ్యానస్థితి. మన మనసుకు లీనం కావటం అనే లక్షణం ఉంది. అంటే పూర్తిగా మరొక వస్తుగుణాన్ని ప్రతిబింబించటం అన్నమాట. మనసు బయటి ప్రపంచంలోని వస్తువిషయాలతో కలిసి లీనమైనప్పుడు దాన్ని అనుభవం అంటున్నాం. అలాగే మనసు తాను కోరుకున్న ఒకానొక జ్ఞాపకంతో మమేకమైన స్థితిని ధ్యానంగా భావిస్తున్నాం. ధ్యానం అనగానే మనసుకు శాంతి అనే ఒక క్రొత్త గుణాన్ని అలవర్చాలని మనం ప్రయత్నిస్తున్నాం. అందువల్లనే వస్తువులు, విషయాల వల్ల ఏర్పడుతున్న దుఃఖాన్ని దూరం చేసుకోవాలని లేదా తప్పించుకోవాలని అనుకుంటున్నాం. అందుకే ఆ వస్తువు విషయాలను దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. దానికి ధ్యానం అని పేరు పెట్టుకున్నాం !"*

*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
  🕉️🚩🕉️

No comments:

Post a Comment