గురుబోధ
శిష్యుడు : గురుదేవా! వాడు మిమ్ములను నిందించాడు.
గురువు : వాడు నా ఆత్మను నిందించాడా? లేక నా దేహాన్ని
నిందించాడా?
"ఆత్మ" ను నిందించాడంటే, అందరిలో వుండే ఆత్మ
ఒకటే. కాబట్టి వాడు తన్ను తాను నిందించు
కొన్నట్లైంది.
దేహాన్ని నిందించాడంటే, మరింత ఉపకారం
చేసినట్లే. దుర్గంధము, అశౌచము , మూత్రపురీష
భాజనము, మలపిండమని నేనూ నిందిస్తూ
వుండేవాణ్ణి. నా శ్రమను వాడూ కొంత
పంచుకున్నాడు.
ॐ
No comments:
Post a Comment