ఆత్మ సాక్షాత్కారము
ప్రాథమికంగా స్థూలశరీరం,ప్రాణశక్తి,మనస్సు మరియు సత్యము అన్నీ సమానమే కాని వాటి నిర్మాణక్రమంలో మరియు విధులలో మాత్రం భిన్నంగా ఉంటాయి.సత్యము ఆకాశకణములుగా మారగా, అవి భిన్న భిన్న పరిమాణములో సంయోగము చెందిపంచభూతాలైనాయి. పంచజ్ఞానేంద్రియములు పంచభూతముల అనుభూతికి తోడ్పడుతాయి. పంచభూతములు పంచేంద్రియములతో చర్య నొందడము వలన పంచతన్మాత్రలేర్పడుతాయి. ప్రాణిలో దైవీస్థితి ,పంచతన్మాత్రలుగా మారగానే మనస్సు ఏర్పడుతుంది.
పంచభూతములు,పంచేంద్రియములు మరియు పంచతన్మాత్రలు ఈ మూడూ ఆదిమస్థితి ఒక చివరగా, మానవునిలోని మనస్సు మరొక చివరగా ఈ రెండింటి మధ్య ఉంటాయి.ఈ ఐదు దశల గురించిన స్పష్టమైన జ్ఞానమే ఆత్మసాక్షాత్కారము. వ్యక్తికి తన మూలము మరియు గమ్యము స్పష్టంగా తెలుస్తాయి. బ్రహ్మానుభూతి స్పష్టమైనప్పుడు, ఆత్మసాక్షాత్కారములో అహంకార మదృశ్యమౌతుంది. మనస్సుకు శాంతి మరియు సంతృప్తి కల్గుతాయి.
సద్గుణవంతమైన జీవితం గడపాలన్పిస్తుంది.పాపపు ముద్రలు నిర్మూలించబడుతాయి. క్రొత్తవి ఏర్పడవు.మనస్సు భ్రమలో నున్నప్పుడు ఏర్పడిన అనుబంధాలు అదృశ్యమౌతాయి.మానవ జన్మ లక్ష్యమిదే.కుండలినీ యోగసాధన ప్రారంభించిన మీకందరికీ ఈ అవకాశముంది.మనస్సును తన మూలానికి మరియు దానికావలనున్న బ్రహ్మానికి తీసుకు వెళ్ళే సాధన అందరికీ ఎంతో ప్రయోజనకరమైనది.
తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి
No comments:
Post a Comment