Sunday, September 4, 2022

రమణ మహర్షి మార్గంలో అసలు ఏమి చేయాలి ? 🌷 సాధన ఎలా చేయాలి ????🌷 ఇది కాని సరిగా అర్థం కాకపోతే మాత్రం ఈ జన్మ వృధా అయిపోతుంది....🌷

అరుణాచల👏
🌸🌷🙏🏻🌷🌸
రమణ మహర్షి మార్గంలో అసలు ఏమి చేయాలి ? 🌷

సాధన ఎలా చేయాలి ????🌷

ఇది కాని సరిగా అర్థం కాకపోతే మాత్రం ఈ జన్మ వృధా అయిపోతుంది....🌷

భగవాన్ రమణ మహర్షిని ఎవరు ఏ ప్రశ్న వేసినా, ఆయన తన వ్యక్తిగత పాండిత్యాన్ని, జ్ఞానాన్ని ప్రదర్శించ కుండా, ఈ ప్రశ్న ఎవరికి వచ్చిందో లోపల విచారించు, అప్పుడు నాకు అనే జవాబు వస్తుంది.. నాకు అన్నప్పుడు నేను అనేవాడిని ఒకడిని ఉండాలి కదా? అయితే ఈ నేను ఎవరు అని ప్రశ్నించి కనుక్కోండి అని చెప్పారు.... 🌷

సరిగ్గా ఇక్కడే మొత్తం దారి తప్పి పోయింది....

భగవాన్ ఏమో సందేహం వచ్చింది ఎవరికి అని విచారించమంటే, అందరూ సత్సంగాల పేరుతో ఆ సందేహాలకి ఎవడికి తోచింది వాళ్ళు జవాబులు చెప్పడానికి గంటలు, రోజులు, సంవత్సరాల ను ఖర్చు పెడుతున్నారు....
ఉదాహారాణకి మాయ అంటే ఏమిటి ? అనేది ప్రశ్న అనుకోండి.. ఇప్పుడు దీనికి మీరు ఎన్ని జన్మలు వెచ్చించినా సమాధానం కనుక్కోలేరు.... టైం వేస్ట్....

భగవాన్ చెప్పినట్టుగా ఆ ప్రశ్న ఎవరికి వచ్చిందో వాళ్ళు, తన లోపల ఈ ప్రశ్న ఎవరికి వచ్చింది అని విచారించుకోవాలే కానీ , దాన్ని పదిమందిలో చర్చకు పెడితే, వంద సమాధానాలు వస్తాయి... వీటిలో నుంచి మళ్ళి కొన్ని కొత్త ప్రశ్నలు పుడతాయి... వాటికి మళ్ళి సమాధానాలు.... ఇలా ఎప్పటికి తెగదు, తెల్లారాదు.... కానీ జీవితం మాత్రం అయిపోతుంది.... ఈ కార్యక్రమానికి సత్సంగం అని ఒక పేరు తగిలించి, మంచిగా కాలక్షేపం చెయ్యండం ఆనవాయితీగా తయారయింది...
కానీ భగవాన్ చెప్పింది ఇది కాదే 🌷

అసలు సందేహాలు ఎవరికి వస్తున్నాయో వాడిని కనుక్కోమని చెప్పారు....
మనమేమో సందేహాలకి జవాబులు కనుక్కోవడం లో ఒక పది పుస్తకాలు ముందు వేసుకొని చాలా బిజీగా ఉన్నాము.... అవునా కాదా ఆలోచించండి.....
Unless you remove (find) the doubter, doubts cannot be vanished....
సందేహించే వాడిని మీరు కనుక్కోనంత వరకు సందేహాలు పోవు, శాంతి రాదు......

అసలు భగవాన్ చెప్పింది ఇదైతే, దీనికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తూ, మేము భగవాన్ భక్తులము, అద్వైత సాధకులం అని చెప్పుకుంటున్నారు.....

భగవాన్ మార్గం ప్రశ్నలకు జవాబులు వెతకడం కాదు.... ప్రశ్న ఎవడికి పుట్టిందో వాడిని వెతకడం..
అప్పుడు మాత్రమే ప్రశ్నలే లేని స్థితి అనుభవానికి వస్తుంది.... ఎప్పుడైతే ప్రశ్నలు, సందేహాలు ఉండవో అప్పుడు మాత్రమే
శాంతి, భయం లేని తనం వస్తాయి...

అప్పటి వరకు మనసంతా గందరగోళమే... మనసులో గందరగోళం ఉంది కాబట్టి, మీ సంసారం, సమాజం, ప్రపంచం కూడా గందరగోళం గానే కనబడుతుంది......

మేము ఎన్నో సంవత్సరాలుగా సత్సంగాలు చేసుకుంటున్నాము, అయినా మాకు భగవాన్ చెప్పిన శాంతి, భయం లేని తనం, అనుభవానికి రావటం లేదు అని చెపుతున్నారు.....
ఇలా చేస్తే ఎందుకు వస్తాయి చెప్పండి....
ఎంతసేపటికి బయట మాటలకే అలవాటు పడి, రోజులు వెళ్లబుచ్చుతుంటే శాంతి, నిర్భయత్వం, వస్తాయా చెప్పండి..
🌸🙏🏻🌸

సేకరణ

No comments:

Post a Comment