...... .....భయం.......
మనందరం గతంలో భయ పడ్డాము . భయ పుడుతూ వున్నాము. భవిష్యత్ లో పడతాము కూడా.
ఇది చదివి భయాన్ని పొగట్టుకోండి.
భయం ఒంటరిగా వుండదు. ఇది ఒక సంఘటనతోనో,ఒక విషయంతోనో , సంబంధంతోనో, వ్యవహారంతోనో ముడి పడి వుంటుంది.
భయం లో 5 అంశాలు వున్నాయి.
1) గందరగోళం.పైన చెప్పిన సంఘటన, వ్యవహారం, మొదలగు వాటి పట్ల మనకు కన్ఫ్యూషన్ వుండి స్పష్టత లోపిస్తుంది.
2) అయిష్టత.జరిగే విషయాల పట్ల అయిష్టంగా వుంటుంది .
3) అపాయం లాగా కనపడుతూ వుంటుంది.
4) మనం బలహీనులం అని అని పిస్తుంది
5) పారిపోదామనే ఆలోచన వుంటుంది
ఈ భయం మనలను ఏమి చేస్తుంది.
1) సమస్యకు పరిష్కారం వున్నా, మనకు తట్టనివ్వదు.
2) మనలను బలహీన పరుస్తుంది
3) తప్పులు చేయిస్తుంది.
ఎలా బయటపడాలి
1) సంఘటనని సరిగ్గా అంచనా వేసి స్పష్టంగా అర్ధం చేసుకోవాలి.
2) ఎల్ల వేళలా అన్నింటికి సన్నిధులై వుండాలి.ఇది ఇష్టాఇష్టాలను తొలగిస్తుంది.
3) ఊహించని సంఘటనలు జరుగుతాయి. అప్రమత్తతగా వుండాలి.
4) దేనినైనా ఉన్నది ఉన్నట్లుగా దర్శించాలి.
అర్థం అయితె భయం పోయినట్లే.
ఇట్లు
భయస్తుడు లేని భయం
No comments:
Post a Comment