💖💖 *"317"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"కోరికకు తావులేని జీవితం కోసం ఏమిచేస్తే సాధ్యమవుతుంది ?"*
**************************
*"మనకి జ్ఞాపకాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి పనిని గుర్తుంచుకోవటం, రెండోది ఆ పని తాలూకా అనుభవాలను గుర్తుంచుకోవటం. మొదటి జ్ఞాపకం వల్ల ఏ ప్రమాదం లేదు. అది కోరికకు కారణం కావటంలేదు. కానీ రెండవదైన అనుభవం తాలూకు జ్ఞాపకమే మళ్ళీ కావాలనిపించేలా ప్రేరేపించి కోరికను కలిగిస్తుంది. మామిడి పండును తినటం అనే జ్ఞాపకం కన్నా అది తిన్నప్పుడు కలిగే మధురమైన అనుభవం మళ్ళీ మామిడి పండును తినాలనిపించేలా చేస్తుంది. ఇలా ప్రతీ క్రియ వెనుక ఒక అనుభవం ఉంటుంది. అనుభవానికి సంబంధించిన అనుభూతిని తొలగించుకోగలిగితే, కోరికకు తావులేని దివ్యజీవనం కొనసాగించటం సాధ్యపడుతుంది !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
No comments:
Post a Comment