ధ్యానం లో ఉన్న మనస్సు ఎలా ఉంటుంది అంటే.
1 ) మాటలకు చేతులకు సమన్వయం వుంటుంది.
2 ) స్వేచ్ఛగా, శక్తి వంతంగా,చురుకుగా, శూన్యంగా(నేను అనే భావన లేకుండా) వుంటుంది
3 ) వర్త మానంలోనే వుంటుంది
4) నవ్యంగా, స్వయంగా, సవ్యంగా స్పందిస్తూంది.
5)నాకు ఏమీ తెలవదు అంటూ నేర్చుకుంటూ వుంటుంది.
6) కట్టుబాట్లకు, ఇష్టాఇష్టాలకు, సాంప్రదాయాలకు, నమ్మ కాలుకు బందీగా వుండదు.
7) ఎక్కడ ఏ అన్యాయం, దోపిడి, అవినీతి జరిగినా బాధ్యత వహిస్తూంది.
8) ఇతరులు మారాలి అని కాక నేను మారతాను అంటుంది.
9) సమస్య వుంటే బయట కాక తన లోనే వెతుక్కుంటూ వుంటుంది
10) అనుభూతి చెందుతూ వున్న స్థితి లో వుంటూ అనుభూతి ని అనుభవం గా మారనీయదు.
11) క్షణం క్షణం ఎరుక సతి లొ వుంటుంది.
12) ఉన్నది ఉన్నట్లుగా చేస్తుంది.తన అభిప్రాయాలు దానిమీద ఆపాదించి చూడదు.
13) తనపై పడే పరిసర ప్రభావాల నుండి రక్షించుకుంటుంది
14)తాను తప్పులను , చేస్తే, ఎవరిమీదా నెట్టక, అంగీకరిస్తుంది.
15) తానే స్వయంగా నిర్ణయం చేస్తుంది.అనుకరణ, విధేయత,అనుసరణ చేయదు.
16) ప్రేమ,కరుణ,దయ, అహింస, నిస్వార్ధంగా వుంటుంది.
ఇట్లు
ధ్యాని లేని ధ్యానం
No comments:
Post a Comment