🕉 శ్రీ గురుభ్యోనమః
పూజ చేయుటకు పువ్వులు, జపము చేయుటకు జపమాల అవసరము. కానీ, బాహ్య పరికరములతో నిమిత్తము లేకుండానే సుగుణములను సంపాదించవచ్చును.
సుగుణములు లేనివాడికి సుగుణముల విలువ తెలియదు. అందువలన వాటిని సంపాదించటానికి ప్రయత్నము చేయడు. సహృదయము లేనివాడు గీతను లోతుగా అధ్యయనము చేయలేడు. భగవంతుని ధ్యానించలేడు.
గుణవంతులే భవిష్యత్తులో ఉజ్వలంగా ప్రకాశిస్తారు. గుణవంతులే శాంతికి, సుఖానికి వారసులు.
మీ మనస్సు ఏకాగ్రమై నిర్మలమైతే, మీకు సూక్ష్మ శక్తి వస్తుంది. మనస్సు సూక్ష్మమైతేనే కదా సృష్టి రహస్యాలు, మీ లోని అందాలు మీకు తెలిసేది?
మీ శరీరానికి శక్తి అన్నము వల్ల వస్తుంది. మీ మనస్సుకి శక్తి శరణాగతి వల్ల వస్తుంది. మీ శరణాగతే గనుక నిజమైతే మీకు ప్రశ్నలే ఉదయించవు.
🙏 *ఓం నమో భగవతే శ్రీ రమణాయ* 🙏
No comments:
Post a Comment