సహనం
🪴🪴🪴🪴🪴
🪴మనిషికి తొందరపాటు ఎక్కువ. అనుకున్నది వెంటనే చేసేయాలనుకుంటాడు.
🪴మనిషికి భయం ఎక్కువ. ఆపద కలగగానే డీలా పడిపోతాడు
🪴మనిషికి ఆవేశం ఎక్కువ. ఇతరులపై కోపం కలగగానే అక్కసు వెళ్లగక్కుతాడు.
🪴మనిషికి నిరాశ ఎక్కువ. బాధ కలగగానే కుమిలిపోతాడు.
🪴మనిషికి దురాశ ఎక్కువ గుడికి వెళ్ళి ఒక్క సెకనుసెకను దణ్ణం పెడతాడు. తరతరాలు కూర్చుని తింటే తరగని సంపదని కోరతాడు.
🪴మనిషికి సహనం తక్కవ ఒక్క రోజు ధ్యానం చేస్తాడు నేను బుద్ధుడు ను కావాలి అంటాడు.
🪴ఒక్కరోజు ధ్యానం చేస్తాడు నాకు ఆరోగ్యం కావాలి అంటాడు.
🪴ఆరోగ్యం రాకపోతే ఫోటోలు మారుస్తాడు గుళ్ళు మారుస్తాడు. మతాలు మారుస్తాడు. దేవుళ్ళను మారుస్తాడు.
🪴దేనికీ కుాడా సహనం ఉండదు మానవునకు.
అందుకే అన్నారు పత్రీగారు సహనమే ప్రగతి అని
🪴మనకు ఏదైతే కావాలో దానికోసం సాధన ఎంతైనా అవసరం.
🪴అయితే...సాధనతో పాటు కాస్తంత ‘సహనం’తో నిరీక్షిస్తే అంతిమంగా ‘విజయం’ సాధించవచ్చు.
🪴సహనం ఒక నిగ్రహశక్తి, ఒక మానసిక పరిపక్వత గల స్థితి.
🪴సహనమనేది నీగమ్యాని కి నిన్ను చేర్చే మార్గం
🪴ముఖ్యంగా కష్టసమయాల్లో ఏదైనా ఉద్వేగాన్ని దాటవేయాలన్నా, వాయిదా వేయాలన్నా సహనం తప్పనిసరి.
🪴ఎదుటి మనిషి నుంచి మనకు దేని కారణంగా ఒత్తిడి కలుగుతుందో, అందులోకి మనం కలసిపోవడం.
🪴అంటే ఎదుటివారిలోని ఏ గుణం మనకు కోపాన్ని తెప్పించి, సహనాన్ని పోగొడుతుందో దానిని మనలోకి ఆవహింపచేసుకోవడమే సహనం.
🪴మరి దీని కోసం ధ్యాన సాధన అవసరం.
🪴మరి మనమందరమూ సహనంతో ధ్యాన సాధనచేద్దాం.మన గమ్యాన్ని మన చేరుకుదాం.
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment