అంతరంగమే ఆరామస్థలి
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈
సముద్రం ఉపరితలంలో తరంగాలతో నాట్యమాడుతుంది. నురగలతో నవ్వుతుంది. గాలివాన వచ్చినప్పుడు ఘోష పెడుతుంది. అయినా లోలోపల అగాధంలో ప్రశాంతంగా, గంభీరంగా, మౌనంగా ఉంటుంది.
అటువంటి దివ్యమైన, ఆధ్యాత్మికమైన అంతరాంతరమే లేకపోతే, మనిషి ఈ లోకంలోని అలుపెరుగని కార్యకలాపాల మధ్య నిలకడగా మనుగడ సాగించలేడు.
నిజానికి మనం సేదతీరే అత్యుత్తమ ఆరామస్థలి మన హృదయమే!
తక్కిన విడిది స్థానాలన్నీ తాత్కాలికమైనవే. కొన్నాళ్లకు విసుగు పుట్టించే విరామాల తావులే!
అందుకే అసలైన ఆనందాభిలాషులు అంతర్ముఖులు. వారు ఎందరిలో ఉన్నా ఏకాంతవాసులు.
మనుషుల్ని పొద్దుచాలని జీవులుగా మార్చేస్తున్న జీవనవేగంలో అరుదుగా లభించేది చిత్తశాంతి. ఆ మానసిక ప్రశాంతితో పాటు మహనీయ స్ఫూర్తిని కూడా ప్రసాదించే స్వస్థలి మాత్రం మన అంతరంగమే!
మన దినచర్య ఎందరినో కలుసుకోవడంతోనే సరిపోతుంది. కాని, మనల్ని మనం కలుసుకోవడానికి సమయం దొరకడం లేదు. మనలోకి మనం తొంగి చూసుకునేందుకు, మన మనసేమి చెప్పాలనుకుంటుందో ఆలకించేందుకు వీలు చిక్కడం లేదు. అందుకే, ‘నిన్ను నువ్వొకసారి కలుసుకొని, నీవెవరివో తెలుసుకో’ అంటారు రమణ మహర్షి.
ఏకాంతంలో పురుడు పోసుకునే ఆలోచనలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ తలపులు దారం తెగిన పతంగాల్లా చెల్లాచెదురయ్యేవి కావు. నెమ్మదిగా మొక్కకు అంటు కడుతున్నట్లు, పూలరేకల్లో రంగులీనుతున్నట్లు, లతలు తీగలుగా సాగుతున్నట్లు... ఆ ఆలోచనలకు దిశానిర్దేశముంటుంది. తత్కారణంగానే తాత్వికులకు, భావుకులకు, మేధావులకు అంతఃకరణాన్ని మించిన ఆత్మీయులుండరు.
సాహిత్యంలో నోబెల్ పురస్కారాన్ని పొందిన తొలి స్వీడన్ కవి ఫర్నర్ ఫాన్ అలా తనలోకి తాను తొంగిచూసుకునే తాదాత్మ్యతతో- ప్రపంచస్థాయి కవితలు, కథలు, నవలలు రచించారు. తన జీవన విషాదాల జడివానలో తల్లి ఒడి లాంటి అంతరంగంలోనే తలదాచుకున్నారు.
ఓ కవితా సంపుటిలో ఆయన ‘ఏకాంతంలో మనిషి తనను తాను తెలుసుకోగలుగుతాడు. సాయంత్రపు చల్లని ఎత్తైన శిఖరాన్ని చేరుకున్న మౌనిలా ప్రపంచాన్ని నిశితంగా పరిశీలించే వివేచన కలిగి ఉంటాడు’ అంటారు.
ఏకాంతమంటే ఏకాకిగా మిగిలిపోవడం కాదు. ఎవరి సాహచర్యాన్నీ సహించలేని సంకుచితత్వమూ కాదు. మనుషుల మధ్యే ఉంటున్నా, మనకు మనంగా మనగలగడం. ముచ్చట్ల హోరులోనూ మౌనంగా మెలగగలగడం!
తనలో తాను రమించే అంతర్ముఖులను బహిరంగంలోని ఏ రణగొణధ్వనులూ ఆటంకపరచలేవు. ఎంత ఒత్తిళ్లతో కూడిన వృత్తి వ్యవహారాలైనా మదిలో ఏ మాత్రం అలజడిని పుట్టించలేవు. అలా మనసును మలచుకున్నవాళ్లు, అయినవారందరి మధ్యే ఉన్నా, అందరికీ అందనివారుగానే ఉంటారు.
ఆ మానసిక పరిణతికి చేరుకున్నవాళ్లు- పనిలో ఉన్నా మరెక్కడ ఉన్నా, అంతరంగంలో మాత్రం పరమానందం అనుభవిస్తూ ఉంటారు. వాళ్ల చేతులు సమాజంలో ఉంటే, వాళ్ల ఆత్మ ఏకాంతంలో ప్రశాంతంగా ఉంటుంది. అందుకే, ‘వీలున్నంత వరకు అందరితో కలిసిమెలసి ఉండు. నీవారిగానే భావిస్తూ ప్రేమను పంచు. పిదప నీ మనోసీమలోకి ప్రవేశించి శాంతిని ఆనందాన్ని అనుభవించు. గోపబాలుడు తోలుకెళ్ళిన ఆవులు పచ్చికబయలుకు చేరుకోగానే అక్కడ మిగిలిన ఆవులతో కలిసిపోతాయి. అవి ఒకే మందకు చెందినవిలా కనిపిస్తాయి. కాని మునిమాపు వేళ ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మళ్లీ విడిపోతాయి. అలా నీ అంతరంగాన నీలో నువ్వుగా ఉండిపో’ అంటారు రామకృష్ణ పరమహంస.
సేకరణ:

No comments:
Post a Comment