Tuesday, October 25, 2022

మంచి మాట..లు(25-10-2022)

 25-10-2022:-మంగళవారం

ఈ రోజు AVB మంచి మాటలు 
 చూడు మిత్రమా!!
మన అవసరం నలుగురికి ఉన్నప్పుడు మనం అందరి వాళ్ళము,, అదే మనకేదైన అవసరం ఉన్నప్పుడు మాత్రం మనం ఒంటరి వాళ్ళము,, ఇదే జీవితం అంటే,,


కొంతమంది కి మనతో అవసరం తప్ప, మనం అవసరం లేదు,,


భయపడి ఆగిపోయిన వాడు కాదు,, ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు గొప్పవాడు,,


మనల్ని గమనించే అన్ని కండ్లు మనం బాగుపడాలి అని అనుకోవు, కొన్ని మనం బాధపడితే చూడాలి అనుకుంటాయి,, అదేనండి మనమంటే గిట్టని వారు మన చెడునే కోరుకుంటారు కానీ మన మంచిని కోరుకోరు కదా,,


జీవితంలో ఒకటి గుర్తుంచుకో,,
ఓటమి అనుభవాన్ని ఇవ్వాలి కానీ ఆవేశాన్ని కాదు,,


బిచ్చగాడైన, బలిసినోడైనా పోరాడేది పైసలు కోసమే మరి తేడా ఎక్కడ వస్తుందంటే, ఆ పైసలు ఒకరిని బతుకునిస్తే, ఇంకొకరికి బలుపునిస్తున్నాయి,,

        వ్యాపారం పేరుతో వచ్చి, మనలని బానిసలుగా చేసి, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని దాదాపుగా 200 సంవత్సరాల పాటు ఏలిన తెల్లధోరలకు ఇప్పుడు ఒక భారతీయుడు మన రుషి సునాన్  అదే తెల్లదొరలకు(ఇంగ్లాండ్) కు ప్రధాని  కావడం నిజంగా ప్రతీ బారతీయుడికి గర్వకారణం
     భూమి గుండ్రంగా ఉన్నదనేదానికి  రుజువు.. ఓపిక పట్టాలి అంతే 👍🤝
 ✒️AVB సుబ్బారావు

No comments:

Post a Comment