Thursday, October 20, 2022

అంతర్దర్శనం

 *అంతర్దర్శనం*

మన కళ్ళు బాహ్య ప్రపంచాన్ని మాత్రమే చూడగలవు. కనిపించే ఈ బాహ్య ప్రపంచాన్ని విశ్లేషిస్తే దీనితో మన సంబంధం అంతా మనసులోనే జరుగుతుందని తెలుస్తుంది. అంతరేంద్రియంగా ఉన్న మనసు లేకపోతే మనం ఈ ప్రపంచాన్ని అనుభవించలేం.

మన పంచేంద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మం ద్వారా విషయాలను గ్రహించటం చేత మనసు తాను దేహాన్నని భావిస్తోంది. దేహస్మృతి వల్ల ఏర్పడ్డ దేహ భావన, మన సత్యమైన ఉనికిని తెలుసుకోనివ్వటంలేదు.

అందుకే శ్రీ రమణ మహర్షి వారు ఇలా చెప్పారు...

దేహస్మృతి లేకపోతే ప్రపంచం లేదు..
మనసు లేకపోతే దేహస్మృతి లేదు..
చైతన్యం లేకపోతే మనసు లేదు..
సత్యవస్తువు లేకపోతే చైతన్యం లేదు..
మనకి.. ఈ ప్రపంచానికి మూలంగా ఉన్న సత్యవస్తువును తెలుసుకోవటమే 'ఆత్మ విచారణ'. 

No comments:

Post a Comment