Sunday, October 16, 2022

నిర్వచనం

 *నిర్వచనం*
    నన్ను నేను ఎప్పుడూ నిర్వచించుకుంటూ వుంటాను.
  నేను ఇట్లా,నేను అట్లా.  నేను ఇది, నేను అది .  నేను అంతే,నేను ఇంతే.
     ఈ నిర్వచనం నన్ను నడిపిస్తుంది.  ఇతరులతో నా సంబంధాన్ని నిర్ణయిస్తుంది.  నా ఆలోచనలను ప్రభావితం చేస్తుంది . నా కార్యకలాపాలలో జోక్యం చేసుకుంటుంది.
      ఇలా నన్ను నేను నిర్వచించుకోడానికి దోహద పడే అంశాలు
 1) నా మీద ఇతరులు వెల్లబుచ్చిన అభిప్రాయాలు.
2) నా అనుభవాలు.
3) నన్ను నేను ఇతరులతో పోల్చుకోవడం.
4)నావిజయాలు,అపజయాలు.5) నా ఇష్టాలు, ఉద్దేశాలు, అంచనాలు. నమ్మకాలు.
    *ధ్యానం అన్ని నిర్వచనాలను రద్దు చేసి నన్ను నన్ను గా వుంచుతుంది*
    ఇట్లు
జీవించే వాడు లేని జీవితం.

No comments:

Post a Comment