ఎక్కువగా గాలి లేని చోట దీపం ఏ ప్రకారంగా నిశ్చలంగా, కదలకుండా వెలుగుతుంటుందో, అలాగే ధ్యానంలో ఉన్న యోగి అదుపులో ఉన్న మనసు ఎటువంటి వికారాలు లేకుండా నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది.
బుద్దిని ఆత్మయందు స్థిరంగా ఉంచి ధ్యానం చేస్తున్న యోగి చిత్తం ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా గాలి లేని చోట పెట్టిన దీపం ఏ ప్రకారంగా నిశ్చలంగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటుందో, అలాగే యోగి చిత్తం ఎటువంటి వికారాలు లేకుండా, ప్రాపంచిక విషయాల వెంట పరుగెత్తకుండా, నిశ్చలంగా, నిర్మలంగా ఉంటుంది.
దీపం యొక్క గుణం అటు ఇటు ఊగడం అంటే దీపం ఊగుతుందని కాదు. దీప కళిక గాలి ఉన్నప్పుడు వేగంగా అటు ఇటు ఊగుతుంది. గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఆరిపోతుంది. అలాగే కోరికలు ఎక్కువగా ఉన్న మనసు మన స్వాధీనంలో ఉండదు. అటు ఇటు ఊగుతుంటుంది. ప్రాపంచిక విషయముల వెంట, కోరికల వెంట, పరుగెడుతుంటుంది. వాటి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మనస్సే ఆత్మయందు స్థిరంగా ఉంచినపుడు గాలిలేని చోట ఉన్న దీపంమాదిరి నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి ముందు మనసును మన స్వాధీనంలో ఉంచుకోవాలి. బయట నుండి విషయాలు లోనికి ప్రవేశించకుండా ఇంద్రియాలను అదుపుచేయాలి. మనసుకు ఉన్న అన్ని ద్వారాలు మూసివేయాలి. అప్పుడు బయట విషయాలు లోపలికిరావు.
🙏
No comments:
Post a Comment