Monday, October 24, 2022

స్త్రీని అవహేళనగా, చులకనగా చూసే వారికి కనువిప్పు.

 🚩స్త్రీని అవహేళనగా, చులకనగా చూసే వారికి కనువిప్పు.🚩

లలితా సహస్రనామ భాష్యము

అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహా

సృష్టికి మూలం స్త్రీ శక్తి ఆ శక్తి యందు ఇమిడియున్న  దివ్యవిగ్రహాలు రెండు:-
1.అమ్మవారు
2. జన్మనిచ్చిన తల్లి

బ్రహ్మాండములు అమ్మవారి యోని నుండీ
జన్మిస్తాయి

పరమాత్మ నుండి పరాశక్తి

పరాశక్తి నుండి ప్రకృతి అనగా పంచభూతములు

ఆకాశము నుండి వాయువు 

వాయువు నుండి అగ్ని

 అగ్ని నుండి జలము

 జలము నుండి పృథ్వీ

ఆవిర్భవించి ప్రకృతి నిర్మాణం జరిగింది

ఈ పంచ భూతములె పంచ ముఖములు గాయత్రి

ఈ ప్రకృతిలో పిండాండములు స్త్రీ యోని నుండి జన్మిస్తాయి .

ముందుగా బ్రహ్మాండ జనన క్రమాన్ని పరిశీలిస్తే ఈ యొక్క పాంచభౌతిక ప్రకృతి స్వరూపిణీ (పంచభూతేశి) యగు జగన్మాతకు 6 ఋతువులు .. బ్రహ్మాండములన్నియు జగద్యోని స్వరూపిణీ జగన్మాత యోని నుండి జన్మించినవి.

పిండాండ జనన క్రమాన్ని పరిశీలిస్తే పాంచభౌతిక దేహానికి 12 ఋతువులు. దీనినే రుతుచక్రం అంటారు.

పిండాండములు మానవ దేహం నందు రజోబిందు శ్వేత బిందు కలయిక వలన పిండంగా ఏర్పడి రుతుక్రమం స్తంభించి నవమాసములు తల్లియొక్క గర్భాలయం నందు నవ దేవీ నిర్మిత నవ ఆవరణ పురి ఈ శరీరం  (శరీరమే శ్రీ చక్రం) గా రూపుదిద్దుకుంటుంది

దేహోదేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః

ఇట్టి దైవీ స్వరూపమైన దేహం నందు ఏర్పడిన రుతుక్రమం స్తంభించనిదే ఈ దేహం నిర్మాణం కాదు

సభ్య సమాజంలో రుతు సమయాన్ని
   
ముట్టు అంటు అనే ఏహ్యమైన ప్రక్రియగా చూస్తున్నారు

 అనాచార సంస్కృతి ప్రభలి

స్త్రీని రుతు సమయంలో ముట్టుకోకుండా దూరంగా ఉంచే విధానం కొనసాగుతుంది.

దానిని విచారించి చూస్తే  మానవ దేహం (నవమాసముల రుతు రక్తము మల మూత్రము) యందు కదా నిర్మాణము జరిగిది .

ఈ శరీరము ఏ విధంగా దైవీ ఆరాధనకు
పూజలకు యజ్ఞయాగాది క్రతువులకు నోము లకు వ్రతాలు చేయడానికి  అర్హమవుతుంది.?

పూర్వ ఆమ్నాయ గ్రంథాలు ఏం చెబుతున్నాయి?

ఋతుక్రమమును ఒక యజ్ఞంగా చెబుతున్నాయి శాస్త్రాలు.

స్త్రీ ఋతుక్రమం 4వ రోజు నుండి దేహం అనూతన అండములను నిర్మాణము చేస్తుంది . అట్టి అండములు సంతానొత్పత్తి కొరకు 16 దినములు స్త్రీ దేహములో సిద్దంగా ఉంటాయి. రజోబిందు శ్వేత బిందు (శుక్రకణాలు) కలయికతో పిండంగా మారుతుంది. ఈ క్రమములో గర్భం ధరించని యెడల ఋతువు ఏర్పడి 3 దినములు రజస్సును ప్రకృతికి ఇవ్వడం జరుగుతుంది .

ఈ ప్రక్రియ స్త్రీ దేహమునందుదేవతలు సృష్టించినది కాదా

వేదములు ఋషి ప్రోక్త ములు పూర్వకాలము నందు ఋషి కన్యలు అనగా స్త్రీలు కూడా  వేద అధ్యయనం చేసేవారు

కాలక్రమంలో స్త్రీలను  వేద అధ్యయనానికి దూరం చేసినారు

ఆమ్నాయములు తంత్రములు శివ పార్వతి సంవాదం శివునిచే పార్వతికి చెప్పబడినవి

ఊర్ధ్వ ఆమ్నాయము నుండి విరచితమైన
కులార్ణవ తంత్రం
జ్ఞానార్ణవ తంత్రం

రుతుక్రమాన్ని ఒక యజ్ఞముగా చెప్తుంది.

దేహమునందుజరుగు ఉచ్వాస నిశ్వాస మొదలు స్త్రీ పురుష సంగమం మరియూ రుతుక్రమాన్ని కూడా ఒక యజ్ఞంగా చెప్పింది శాస్త్రం

స్త్రీ యొక్క  రుతుక్రమ సమయాన్ని అంటరానితనంగా చూసే  మానసిక దుర్భరత్వ స్థితి నుండి మేల్కొని స్త్రీ ఋతు సమయాన్ని పవిత్ర భావనతో ఆచరించనివ్వండి..

దక్షయజ్ఞమునందు యోగాగ్నిలో శరీరాన్ని చాలించిన సతీదేవి శరీర భాగాలు పడిన స్థలములే  శక్తి పీఠాలు

అట్టి పీఠాలలో ప్రధాన శక్తిపీఠం అస్సాం లోఉంది కామాఖ్య శక్తిపీఠం .

సతీదేవి  శరీర భాగముల లో (యోని) (భగము) పడిన స్థానము

ఇప్పటికీ అమ్మవారి యోని భాగమునే  ఆరాధిస్తారు

సతీ దేవి యోని భాగం ఈరోజు వరకు ప్రతి సంవత్సరం రుతుక్రమం జరుగుతూ ఉంటుంది.

అట్టి సమయాన్ని అక్కడ అర్చకులు మహా పర్వదినములుగా ఆచరిస్తారు.

కామాఖ్య అమ్మవారు  రహోయాగ క్రమారాధనలో ఉంటుంది అని  ఈ ప్రకృతికి సమస్తానికి సృష్టి స్థానంగా భావిస్తారు

కామాఖ్య దేవి ప్రకృతికి సృజనాత్మక శక్తిని  ప్రసాదిస్తుంది అని నమ్ముతారు.

ఆ పర్వదినాలలో విశేషంగా మంత్ర,,యంత్ర ,తంత్ర, జప, తప ,యజ్ఞ ,యోగ, సాధనలు చేస్తారు.

వేదమాత, ప్రకృతి శక్తి ,గాయత్రి ,గీతామాత, నదీమ తల్లి ,గోమాత , భూమాత అని   చివరికి ద్విజులు ధరించే గాయత్రి కూడా స్త్రీ శక్తి రూప  నిర్మితమై ఉంది

సర్వత్రా స్త్రీ రూపంలో దేవతలను ఆరాధించే సంస్కృతిలో జన్మించిన మనము  స్త్రీ విలువను తెలుసుకుందాం

యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః

సర్వభూతములు మాతృత్వాన్ని సంతరించుకున్నాయి అని మంత్రాలు చెబుతున్నాయి
  
స్త్రీ ని అంటరానిదానిగా చూస్తున్న ఓ సభ్యసమాజమా మేలుకో..

స్త్రీ లేనిదే సృష్టి లేదు.నీవు లేవు..నేను లేను..ఏదీ లేదు

స్త్రీ విలాస వస్తువు కాదు. పరాశక్తి.

స్త్రీ యోని నుంచి జన్మించిన జీవుడు
భగవతి యోనిలో ప్రవేశించడమే మోక్షం 

స్త్రీ నీ పూజిద్దాం.. స్త్రీ ని గౌరవిద్దాం..

(స్త్రీ శరీరంలో అవయవాలను చూసినపుడు

స్తనాలు నీకు పాలిచ్చి పోషించిన అమృతభాండములని ,

 నాభిస్థానం నీ శరీర నిర్మాణము జరిగిన గర్భాలయ స్థానమని,

నడుము నీ బాల్యదశలో పారాడి అధిష్టించిన  సింహాసనమని,

యోని నీ జన్మస్థానం అని ఆలోచిస్తే

 ప్రతి స్త్రీలో ను
ఆ జగన్మాత  మాతృ మూర్తి కనపడుతుంది..

అపుడు స్త్రీల మీద  ఎటువంటి అఘాయిత్యాలు జరగవు..

యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ:

🙏సమస్త సన్మంగళాని భవంతు... 🙏

No comments:

Post a Comment