041022i2202. 👆👆051022-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
పాలపిట్ట దర్శనం ఎందుకు?
➖➖➖✍️
విజయదశమి సందర్భంగా దసరా రోజున పాలపిట్టను దర్శించుకోవడం వల్ల అన్నీ శుభాలే కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
అయితే అసలు పాలపిట్టను ఎందుకు దర్శించుకోవాలి ? దాని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…
పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించాక విజయదశమి రోజు శమీ వృక్షంపై (జమ్మి చెట్టు) ఉన్న తమ ఆయుధాలను తీసుకుని హస్తినాపురం వైపు ప్రయాణానికి ఉద్యుక్తులు కాగా ఆ సమయంలో వారు ఎదురుగా వచ్చిన పాలపిట్టను చూస్తారు.
అప్పటి నుండి పాండవులకు అన్నీ శుభాలే కలుగుతాయి.
కుఱుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై వారు విజయం సాధిస్తారు.
అప్పటి నుండి దసరా రోజున ( విజయదశమి రోజున) పాలపిట్టను చూడడం ఆనవాయితీగా వస్తోందని పురాణాలు చెబుతున్నాయి.
పాలపిట్ట సాక్షాత్తూ దేవీ స్వరూపమని, అది ఉత్తర దిక్కు నుంచి వస్తే ఇంకా మంచిదని, శుభాలు, విజయాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment