మనిషి తత్వం
దేహం అందంగా ఆరోగ్యంగా
ఉన్నంతకాలం కోరికల వెంటపడతాడు
శరీరం జీర్ణవస్థకు చేరినప్పుడు ఇక ఈ బాధ భరించలేని నాకు చావు రాకపోతే అని బాధ పడతాడు
ఆరోగ్యంగా ఉన్నప్పుడు చావు కోరుకోడు
దేహం శిథిలమైనప్పుడే నరక యాతన అనుభవిస్తున్నప్పుడే బ్రతకాలని అనుకోడు నిత్యం
2000 రూపాయల నోటు మంచిగా వుంటే దగ్గర ఉంచుకుంటాడు అదే
2000 చినిగిపోయిన నోట్లు అయితే తక్షణమే వదిలించుకోవాలని చూస్తాడు నిత్యం
పండ్లు ఫలాలు తాజాగా ఉన్నప్పుడు అడిగిన ఇవ్వడు ఒకవేళ అవి కుళ్ళిపోతే దగ్గర దాచుకోమన్న దాచుకోలేడు ఎప్పుడు బయటపడేద్దమా అని చూస్తాడు నిత్యం
భార్య వయసులో అందంగా ఉంటే దూరంగా ఉండలేడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత పిలిచిన రాడు భార్య వద్దకు ఎప్పుడు భార్య నుండి తప్పించుకోవాలని చూస్తాడు నిత్యం
వస్తు వాహనాలు మంచిగా ఉన్నప్పుడు దాని మీద గీతలు పడనివ్వడు అదే
చెడిపోతే తుప్పు పట్టి పోయినప్పుడు వాటిని ఇంట్లో ఉంచుకోమన్న ఉంచుకోడు
మనిషికి మంచిగా ఉన్నప్పుడు వదిలిపెట్టాడు
చెడిపోయినప్పుడు తన వద్ద ఉంటే భరించలేడు
మనిషికి ఎప్పుడు మంచిగా ఉంటే కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు నిత్యం
చెడిపోయిన తర్వాత ఇక వదిలించుకునే ప్రయత్నం చేస్తాడు నిత్యం
కొత్తగా ఉన్నప్పుడు కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు
కాస్త చెడిపోతే బాగు చేయించుకుంటాడు
పూర్తిగా చెడిపోతే వదిలించుకోవాలని చూస్తాడు
వీటి మధ్యనే మనిషి జీవితం ముగిసి పోతుంది
.
No comments:
Post a Comment