ఈ రోజు మానస సరోవరం నుంచి మంచిమాట.
చెడ్డ అలవాట్లు ఉన్న వ్యక్తితో కలిసి తిరిగినా పెద్దగా ఏమీ కాదు, కానీ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తన అవసరం కోసం వాడుకునే వ్యక్తితో మాత్రం చాలా దూరంగా ఉండాలి, వారితోనే ప్రమాదం , మీ సమయము, ధనము వృధా అవుతాయి,ఆలోచించండి ..
మనస్సు సరిగా లేనప్పడు మాటల జోలికి వెళ్ల కండి .మనస్సు ను సరి చేసుకునే0దుకు మార్గాలు ఉన్నవి
కానీ మాటల్ని వేనక్కు తీసుకొనేందుకు ఒక్క మార్గం లేదు .అందుకే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని అంటారు పెద్దలు
మన జీవితంలో ఎదురయ్యే వారంతా మన గురువులే.... మంచివాళ్ళు పాఠం నేర్పుతారు చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు .చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది. కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది.
మన జీవితంలో ఇద్దరిని మర్చిపోకూడదు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చిన వారిని
.చీకట్లోనే నక్షత్రాలు
కనపడతాయి అలాగే!
కష్టాల్లోనే సత్యాలు
గోచరమవుతాయి....!!
పొగడ్తల్ని, విమర్శల్ని
సమానంగా స్వీకరించాలి.
ఎందుకంటే! పువ్వు వికసించాలంటే
ఎండా, వాన రెండూ కావాలి.
నీ చికాకులో ఎక్కువగా మౌనమే వహించు.ఆ సమయంలో నీ నోటినుండి వచ్చేవి మాటలుకాదు . మారణాయుధాలు
."
మనం సంతోషంగా బతకాలి అనుకుంటే
మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో
అని ఆలోచించడం మానేయాలి."
ఓర్పు, ఓరిమి, సహనము
కోల్పోయినట్లయితే
ఎంతోకాలంశ్రమించి, కష్టించి, కృషిచేసి సంపాదించిన మంచిపేరు, ప్రతిష్ఠలు
ఒక క్షణంలో మటుమాయం
అయిపోతాయి.సంపాదించడం ఒక ఎత్తు. దానిని నిలబెట్టుకోవడం
మరొక ఎత్తు
సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నాం
అనే దాన్నికన్న ఎదుటి వాళ్లు ఏం చేస్తున్నారుఅనే దానిపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తారు జాగ్రత్త .
చేతులున్నందుకు దానంచేయాలి . చెవులున్నందుకు మంచి మాటలు వినాలి. నోరున్నందుకు మంచి మాట మాట్లాడాలి . అందుకే ఒక మంచిమాట తలకు కిరీటాన్ని పెడితే, ఒక చెడుమాట తలను తీసేస్తుంది. ఒక మంచి మాట తృప్తిని కల్గిస్తే, ఒక చెడుమాట మనసును కలిచివేసి, ఆబాధ జీవితాంతం గుర్తు ఉండేలా చేస్తుంది.....
ఏడుతరాల కోసం ఎంత ఆర్జిస్తే మాత్రం ఏం లాభం! రెండోతరానికి నువ్వు కట్టిన ఇంట్లో
నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు,
మూడోతరానికి నీ పేరే గుర్తు పెట్టుకునే ఙ్ఞాపకశక్తి లేనప్పుడు.అలా అని
సంపాదన మానేయడం కాదు.
మితిమీరి సంపాదించకుండా ఉండటం ఉత్తమం.
చెవులతో శబ్దాన్ని, కంటితో రూపాన్ని, ముక్కుతో పరిమళాన్ని, నాలుకతో రుచిని, చర్మంతో స్పర్శని దేవుడు ప్రతి మనిషికి ఎలా ఐతే ఇచ్చాడో అలాగే మనస్సుతో మానవత్వాన్ని చూడమని మనస్సు కుడా ఇచ్చాడు. కాబట్టి అన్ని ఇచ్చిన ఆ దేవుడికి మన కృతజ్ఞతగా ప్రక్కవాడు కష్టాలలో ఉంటె ఆదుకోవాలని, ఆ పుణ్యమార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుందాం......
సేకరణ ✒️ మీ రామిరెడ్డి మానస సరోవరం

No comments:
Post a Comment