Sunday, October 16, 2022

భగవంతుని ఉనికి, రూపం ఎలా తెలుసుకోవీలవుతుంది ?

 💖💖💖
       💖💖 *"359"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼

*"భగవంతుని ఉనికి, రూపం ఎలా తెలుసుకోవీలవుతుంది ?"*
**************************

*"రూపనామాలతో దైవాన్ని దర్శించుకోవటంలో అసమానత ఉంది. ఎందుకంటే ఒక దైవాన్ని సైతం అందరం ఒకే రూపంలో దర్శించుకోలేం. దైవదర్శనంలో అందరం సమానమయ్యేది దైవాన్ని మన అంతరంలో రూపనామాలకు అతీతంగా దర్శించుకోగలిగినప్పుడే. మనలో భగవంతుని ఉనికి ఉంది గానీ రూపంలేదు. అందుకే భగవంతుడిని తెలుసుకోగలం గానీ చూడలేం. భగవంతుడు మనం కావాలనుకున్న రూపంలో కనిపిస్తాడు. కానీ అది శాశ్వతరూపం కాదు. నరసింహస్వామి రూపంలో అవతరించాలనేది శ్రీమహావిష్ణువు సంకల్పం కాదు. అది హిరణ్యకశిపుడి అభీష్టం. ఒకటి వద్దనటంలోనే మరొకటి కావాలనే అర్ధం ఉంటుంది. అలాగే రాక్షసరాజు తనకు మరణం ఎలా వద్దని కోరటంలోనే ఎలాంటి మరణం కావాలనే నిర్ణయం ఇమిడివుంది. భగవంతుడు మన ఇష్టం కోసం రూపంలో వచ్చినా, కనిపించినా ఆయన మనలో నిరాకారుడుగా శాశ్వితుడుగా ఉన్నాడు. భగవంతుని సృష్టిలో అసమానతలేదు. అలాంటిది ఆయన దర్శనంలో మాత్రం అసమానత ఎలా ఉంటుంది !"*

*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
           🌼💖🌼💖🌼
                 🌼🕉️🌼
              

No comments:

Post a Comment