Thursday, October 20, 2022

భారతీయ ప్రతిభను చాటి చెప్పిన ప్రవాస భారతీయులు

 Source from భారతీయ ప్రతిభా విశేషాలు 108 నిజాలు
-----------------------------------------------------------------------

భారతీయ ప్రతిభను చాటి చెప్పిన ప్రవాస భారతీయులు



NRI – Scientists & Intellectuals

భారతదేశం నుంచి ఎంత ఎక్కువ మంది విదేశాలకు వెళితే అంత త్వరగా భారతదేశం పురోగతి సాధిస్తుంది – “స్వామి వివేకానంద నూట ఇరవై సంవత్సరాల క్రితం అన్నమాటలివి.
ఈమాట నేడు అక్షరాలా నిజం అవుతూ ఉంది. విదేశాలకు వెళ్లిన 2 కోట మంది ప్రవాస భారతీయులు తమ మాతృదేశానికి బాసటగా నిలుస్తున్నారు. వీరు గత సంవత్సరం మాత్రమే 21 మిలియన్ డాలర్లు మన దేశానికి పంపించారు. వీరు పెక్కు దేశాలలో కీలక పదవులలో ఉండటమే కాకుండా, ఆ దేశాల పురోగతికి పాటుబడుతున్నారు. అటువంటి ప్రవాస భారతీయ మేధావులు, వ్యాపార వేత్తలు, ధనవంతులు రాజకీయ నాయకులు మొదలైన వారి గురించి తెలుసుకుందాం.

సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్
----------------------------------
స్వాతంత్ర్యం పూర్వపు భారతదేశంలో 1910, అక్టోబర్ 19 న లాహోర్ నగరంలో జన్మించాడు. ఇతనికి 1983 లో భౌతిక శాస్త్రంలో నోబుల్ బహుమతి లభించింది. 
చికాగో విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పని చేసాడు. “ది స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్” అనే ఇతని పరిశోధనకుగాను ఇతనికి నోబుల్ బహుమతి వచ్చింది. 
1999 “నాసా” తన నాలుగు ఖగోళ పరిశోధనా కేంద్రాలలో ఒక్కదానికి “చంద్రశేఖర్” అని పేరు పెట్టింది. 1958 లో ఒక “ఆస్ట్రాయిడ్” కి ఈయన జ్ఞాపకార్ధం చంద్ర అని పేరుపెట్టారు. 
చంద్రశేఖర్ ప్రప్రధమంగా బ్రిటన్ వెళుతున్న సమయంలో నౌకలో ప్రయాణిస్తూ రూపొందించిన నక్షత్రాల వయసును కొలవగలిగే ప్రమాణానికి “చంద్రశేఖర్ లిమిట్” అని పేరు పెట్టారు. ఇది అతి చిన్న వయసులోనే ఇతను చేసిన గొప్ప పరిశోధనకు నిదర్శనం. 
ఇతను ప్రఖ్యాత శాస్త్రవేత్త సి.వి.రామన్ కి దగ్గర బంధువు కూడా. అనేక అంతర్జాతీయ స్థాయి బహుమతులు పొందారు చివరకు 1995 లో అమెరికాలో మరణించారు. 

అమర్త్యసేన్
-----------------
అమర్త్యసేన్ 1933 లో బెంగాలో శాంతినికేతన్ లో జన్మించారు. ఇతనో గొప్ప ఆర్థికవేత్త. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ట్రినిటీ కాలజీలో అధ్యాపకునిగా పని చేసారు. వీరికి 1998 లో ఆర్థిక శాస్త్రంలో నోబుల్ బహుమతి లభించింది. 
ఇతను ఆర్థిక శాస్త్రాన్ని “వెల్త్ మేగ్జిమైజేషన్” నుంచీ “వెల్ఫేర్ ఎకనామిక్స్” వైపు మళ్ళించి , మనిషికి ఆర్థక స్వేచ్చ ఉందాలని “ఆర్ధిక సూచికలు” తయారుచేసారు. దీనినే “హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్”(Human Development Index) అంటారు.

హరగోవింద్ ఖురానా
-----------------------------
భారతదేశంలో 1922 జనవరి 9 న జన్మించారు. ఇతను ఇంగాండ్, జూరిచ్ లో చదువుకుని అమెరికాలో స్థిరపడ్డారు. MIT లో ప్రొఫెసర్ గా పనిచేసేవారు. 
1968లో జెనిటిక్ కోడ్ విశ్లేషణ గాను (ప్రొటీన్ సింథసిస్) వైద్య రంగంలో నోబుల్ బహుమతి లభించింది. 
శ్రీ ఖురానా జనిటిక్స్ ప్రొటీన్ సింథసైసిస్ పై చేసిన పరిశోధన అత్యంత ప్రాముఖ్యమైనది. కృత్రిమ జీన్స్ (Artificial Genes) జనిటిక్ ఇంజనీరింగ్ లో ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా క్లోనింగ్, క్రొత్త మొక్కలు, క్రొత్త జీవుల సృష్టి చేయవచ్చు. ఖురానా చేసిన పరిశోధన వలన మనకు కావలసిన “జీన్స్” ఏ కంపెనీ నుంచైనా కొనుక్కుని పరిశోధనలలో ఉపయోగించవచ్చు. 

నయిపాల్
---------------
వి.యస్. నయిపాల్ భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ నవలా రచయిత. ఇతను 1932 లో కరేబియన్ దీవులలోని “ట్రినిడాడ్ “ అనే దేశంలో జన్మించాడు. 
ఇతనికి సాహిత్యరంగంలో 2001 నాటికి బోబుల్ బహుమతి లభించింది. ఇతను ఎన్నో పుస్తకాలు, నవలలు రచించారు. భారతదేశం గురించీ, ఇతర ప్రపంచ నాగరికతల గురించి ఎన్నో చారిత్రాత్మక పరిశోధనాత్మక రచనలు చేసారు.

బాలమురళి అంబటి
-----------------------------
13 ఏళ్లకే డిగ్రీ పొంది 17 సంవత్సరాల వయసులో 1995 లో డాక్టరుగా ప్రపంచ రికార్డు సృష్టించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో “నేత్రవైద్యం” లో పరిశోధనలు చేస్తున్నారు. ఇతను అతని తమ్మునితో కలిసి AIDS మీద ఒక పుస్తకం కూడా రచించారు. 

సి.యస్. కుమార్ పాటిల్
----------------------------------
ప్రముఖ శాస్త్రవేత్త. 1996 లో “నేషనల్ మోడల్ ఆఫ్ సైన్స్” అమెరికాలో ఇంజనీరింగ్ సైన్స్ రంగాలకు ఇచ్చే అత్యుత్తమ అవార్డు, ఇతని అప్పటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ బహూకరించారు. ఇతను కనుగొన్న “కార్బన్ డై ఆక్సైడ్ లేజర్” విధానం నేడు ఎంతో ప్రాముఖ్యమైనది. శస్త్ర చికిత్సలలో దీనికి విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు. 

డా|| నరేంద్ర సింగ్
------------------------
ఇతను పంజాబ్ లో జన్మించాడు ఇంగ్లాండ్ లో చదువుకొని అమెరికాలో స్థిరపడ్డాడు. ఇతనికి “ఫాధర్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్” అని బిరుదుగలదు. ఈ “ఫైబర్ ఆప్టిక్స్” టెక్నాలజీ 21 శతాబ్దంలో టెలీకమ్యూనికేషన్ రంగం, వైద్య, రక్షణ, ఐటీ రంగాలలో అతి కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. “Forbes” పత్రిక తన 1999, నవంబర్ 2 సంచికలో శతాబ్దంలో ప్రపంచం గుర్తించిన ఏడుగురు ప్రముఖ వ్యాపారస్థులలో ఒకనిగా వీరిని గుర్తించింది. ఇతను “ఫైబర్ ఆప్టిక్” రంగంలో ఎన్నో పరిశ్రమలను కూడా స్థాపించారు.

మణిలాల్ భౌమిక్
-------------------------
ఇతను కలకత్తాలో ఖరగ్ పూర్ లో చదువుకున్నాడు. “Excimer laser” అనే టెక్నాలజీని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో కనుగొన్నాడు. దీనికి కంటి ఆపరేషన్ లలో ఉపయోగిస్తారు. దీనివల్ల అద్దాలు , కాంటాక్ట్ లెంస్ లు వాడవలసిన అవసరంలేదు. ఇది ప్రపంచంలో దావాగ్నిలా వ్యాపిస్తూ ఉన్న శస్త్రవిద్యావిధానం ఇతను ఎన్నో గ్రంధాలు రచించాడు. ఇతని ఆత్మకధ “మణి ది జువల్” బెంగాల్లో చాలా ప్రసిధ్ధమఈనది

రాజ్ రెడ్డి
-------------
మన తెలుగువాడు. నేడు కంప్యూటర్ మాటలు నేర్పె పనిలో ఉన్నారు. Artificial Intelligence; Robotics and Human Computer Interaction కంప్యూటర్ సైంస్ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన “Turing” అవార్డ్ 1994 లో ఇతనికే లభించింది అమెరికా అధ్యక్షుని సలహా సంఘంలో సభ్యుడు. ఇంకా ప్రతిష్టాత్మకమైన వాణిజ్య సంస్థలలో కూడా రెడ్డిగారు సభ్యులుగా ఉన్నారు. 
వీరికి భారత ప్రభుత్వం 2001 లో “పద్మభూషణ్” అవార్డు ఇచ్చింది. 1994 ఫ్రెంచ్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ఇచ్చి సత్కరించింది. 2006లో అమెరికాలోని ‘నేషన్ల్ సైన్స్ బోర్డ్’ ఇతనికి “వార్నియర్ బుష్” అవార్డ్ ప్రధానం చేసింది. వీరు ‘Carnegie Mellon Robotics Institute’ స్థాపించారు. 

వినోద్ ధామ్
------------------
1971లో ఢిల్లీ యూనివర్శిటీలో పట్టభద్రుడై, 1975 సిన్ సినాటీ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తి చేసుకుని అమెరికాలోని “మైక్రో ఎలక్ట్రానిక్స్, సెమీకండెక్టర్ ఇండస్ట్రీ” లో తన నైపుణ్యం ప్రదర్శించుకున్న ప్రముఖ ప్రవాస భారతీయుడు. ఇతను ఇంటెల్ , AMD మొదలైన సంస్థల్లో పనిచేసి ఎన్నో క్రొత్త కంప్యూటర్ హార్డ్ వేర్ ఉత్పతులను కనుగొన్నాడు. ఇతను నేడు విశ్వఖ్యాతి గాంచిన “ఇంటెల్ పెంటియం చిప్” సృష్టికర్త నేడు ప్రపంచం మొత్తం మీద PC ల్లో వాడే పెంటియం టెక్నాలజీ ఇతని కృషి ఫలితమే. సిలికాన్ వ్యాలీలో నేడితను ఓ ప్రముఖ వ్యాపారవేత్త, కోటీశ్వరుడు.

జార్జి సుదర్శన్
--------------------
కేరళలో జన్మించాడు . మద్రాసులో చదువుకున్నాడు. న్యూయార్క్ లో స్థిరపడ్డాడు. ఇతను ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త. “క్వాంటమ్ ఆప్టిక్స్ “ (Quantum Optics) లో ఎనలేని కృషిచేసి ఎన్నో సిధ్ధాంతాలు కనుగొన్నాదు. ఇతను “Tachyon” అనే కణాలను ప్రతిపాదించాడు. ఈ కణాలు కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో పయనించే కణాలు. 1976లో ఇతనికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించింది. కానీ 2005లో ఇతనికి “నోబుల్” బహుఅతి రాకపోవటం వివాదాలకు దారితీసింది. చివరికి 2007 లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ తో సన్మానించింది.

నీల్ కాత్యాల్
------------------
అమెరికాలో 40 ఏళ్లలోపు వయస్సు ఉన్న 40 మంది న్యాయవాదులలో ఒకరుగా “నేషన్ల్ లా జర్నల్” అనె అమెరికా పత్రిక గుర్తించింది. ఇప్పుడు వారు U.S కి యాక్టింగ్ సోలిసిటర్ జనరల్ గా సేవలు అందిస్తున్నారు.

అనితా గోయల్
----------------------
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 35 మంది యువ “High-tech Innovations”లో ఒకరిగా అమెరికాలోని MIT (టెక్నాలజీ రివ్యూ మేగజైన గుర్తించింది). వీరు “Nanobiosym” అనే సంస్థకు స్థాపకాధ్యక్ష్యులు

రజిత్ మనోహర్
-----------------------
అమెరికాలో Comell విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైంస్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఇతను కనుగొన్న కంప్యూటర్ చిప్ (Clockless Chip) ఇతర చిప్ ల కంటే 10 రెట్లు ఎక్కువ సమర్ధత కలిగినది.

నరసింహాచారి
--------------------
వీరు కూడా అమెరికాలోని MIT టెక్నాలజీ ‘ది రివ్యూ మేగజైన్’ చే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 35 మంది యువ “High-tech Innovations” లో ఒకరిగా గుర్తించబడ్డారు. “Wireless Meshnet Working Standard” కనుగొన్నాడు. దీని ద్వారా రక్షణ వ్యవస్థకే పరిమితమఈన ఈ టెక్నాలజీ నేడు పౌరఅవసరాలకు కూడా ఉపయోగించగలుగుతున్నారు. ఇతను “Trops Nework” అధినేత

శిలాదిత్యసేన్ గుప్త
--------------------------
హార్వర్డు విశ్వవిద్యాలయం మెడికల్ స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్. కేన్సర్ చికిత్సలో ఉపయోగించే కీమోథెరపీ యొక్క విధానంలో గణనీయమైన మార్పు తీసుకువచ్చాడు. ఇది “Nanocell” అనే మందులను అందించే పరికరం కనుగొనడం వలన సాధ్యపడింది. MIT టెక్నాలజీ మ్యాగజైన్ ఈ పరిశోధన గురించి చాలా ప్రశంచించింది. 

విక్రమ్ షీల్ కుమార్
---------------------------
బయోటెక్నాలజీ , మెడిసిన్ రంగాలలో ఇతనిని MIT టెక్నాలజీ రివ్యూ మేగజైన్ (2004) 35 ఏళ్ళ వయస్సులోపు 100 మంది యువ శాస్త్రవేత్తలలో “High-tech Innovations” గుర్తించింది. ఇతను “అమెరికా యువశాస్త్రవేత్త” (Toya) అవార్డ్ పొందిన తొలి భారతీయుడు 
పైన పేర్కొనబడిన మేధావులు, శాస్త్రవేత్త్తలు , నిపుణులు తమ శక్తి యుక్తులను ధారపోసి అనేక పాశ్చాత్య దేశాల నిర్మాణంలో పాలు పంచుకుంటున్న భారతీయులు. వీరందరి కృషి అంతర్గతంగా ఆయా దేశాల అభ్యున్నతికి దోహదపడుతున్నది. ఇలా ఇంకా ఎందరో అర్థవంతంగా వెలుగొందుతున్నారు. 

మీ

*ధర్మవీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక*


No comments:

Post a Comment