Wednesday, October 5, 2022

🌹 విజయదశమి విశిష్టత - శుభాకాంక్షలు 🌹

 🌹 విజయదశమి విశిష్టత - శుభాకాంక్షలు 🌹

విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ రోజు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది. శమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది.

విజయదశమి హిందువులకు ఏడాదికి ఒక్కసారి వచ్చే పెద్ద పండుగ, దీన్ని దసరా అని కూడా అంటారు. దుష్ట శక్తులను సంహరించి జగత్తును కాపాడిన జగన్మాత విజయంగా భావిస్తారు. మరో విధంగా చెడు మీద మంచి విజయం సాధించినట్టుగా సూచిస్తుంది. ఈ పండుగ పది రోజులు జరుపుకుంటాం.

చివరి మూడు రోజులకు అంటే దుర్గాష్ఠమి, మహర్నవమి, విజయదశమికి ఒక విశిష్టత ఉంది. మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను జయించాలన్న దృష్టితో ప్రజలను చిత్రహింసలు పెడుతుండేవాడు. ఆ బాధలను తట్టుకోలేక ముల్లోకాల బాధితులు త్రిమూర్తుల వద్దకు వచ్చి తమ ఆవేదనను వెళ్లబుచ్చకున్నారు. ఈ బాధ్యతను ఆదిపరాశక్తి జగన్మాత అయిన దుర్గాదేవి తీసుకుంది. ఆ రాక్షసుడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. వెంటనే తాను తనను వివాహం చేసుకోవాలన్నట్లు సదరు రాక్షసుడికి తెలిపింది. దీంతో ఆ ముగ్ధమనోహర రూపానికి దాసుడైపోయినా రాక్షసుడు వెంటనే అంగీకరించాడు. కానీ వివాహం చేసుకోవాలంటే తనపై యుద్ధం చేసి గెలవాలని జగన్మాత షరతు పెట్టింది. అందుకు అంగీకరించిన రాక్షసుడు యుద్దానికి సిద్ధమయ్యాడు. వీరిద్దరి మధ్య తొమ్మిది రోజుల పాటు భీకరమైన యుద్ధం కొనసాగింది.

ఈ నేపథ్యంలో రోజుకొక రూపం చొప్పున తొమ్మిది అవతారాలతో పోరాడిన జగన్మాత పదవ రోజు మహాకాళీమాతగా అవతారమెత్తి మహిషాసురున్ని సంహరించి దశమి రోజున విజయం సాధించి ముల్లోకాలను కాపాడింది. ఈ అపూర్వ విజాయానికి ప్రతీకగానే మనం ప్రతి ఏటా ఈ పదిరోజులను పండుగగా భావిస్తూ మొదటి తొమ్మిది రోజులు నవరాత్రులుగా దుర్గాదేవిని రోజుకొక రూపంతో అలంకరించి పదవరోజు అంటే దశమి రోజున విజయదశమిగా జరుపుకుంటున్నాం. ఇది దక్షిణాదిన తెలసిన కథ.

ఉత్తరాది వారు రావణాసురుడిని శ్రీరాముడు తొమ్మిదిరోజులు యుద్ధం సాగించి దశకంఠుడిని దశమి నాడు సంహరించడం వలన విజయదశమిగా భావిస్తారు. అక్కడ విజయదశమి కన్నా దసరా అనే పేరుతో పిలుస్తుంటారు.

ఇందుకు కారణం దసరాను సంస్కృతంలో దశ – హర అంటే దశ అంటే పది హర అంటే సంహరించడం అనేఅర్థం. విజయ దశమిని దసరాగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

🌻 సమూహ సభ్యులందరికి హృదయ పూర్వక విజయదశమి పర్వదినం శుభాకాంక్షలు  🌻
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

No comments:

Post a Comment