మనస్సాక్షి యే అసలైన తీర్పు
నిజానికి మనం నీతిగా జీవించడానికి మనకి ఏ పుస్తకం, ఏ ప్రవచనం అవసరం ఉండదు. నిజమైన న్యాయస్థానం మన హృదయమే. చెడుని చేయద్దని మనస్సాక్షి అడ్డుకుంటుంది. అలాగే మంచిని చేయమని ప్రోత్సహిస్తుందది.
కాని మనలోని స్వార్ధ పూరిత మనసు మనస్సాక్షి తీర్పుని పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు తను ప్రవర్తిస్తూంటుంది. కాబట్టి హృదయం చెప్పే ధర్మాన్ని సర్వోన్నతంగా భావించి మనం దాన్నే ఆచరిస్తే చాలు.
మనం చేసే కర్మలే మన కేరక్టర్ ని తీర్చిదిద్దుతాయి. మన మనసు పరిశుద్ధంగా ఉంటే మంచి కర్మలు, అశుద్ధంగా ఉంటే చెడ్డ కర్మలు చేస్తాం. మనలోని ఈ మంచి, చెడులని నిర్ణయించేది మనం ఎంత స్వార్ధంగా ఉన్నాం లేదా ఎంత నిస్వార్ధంగా ఉన్నాం అన్నదే.
పెద్ద విషయాల్లో నిజాయితీగా ఉండటం గొప్ప కాదు. మనం పట్టుబడ్డా పెద్దగా శిక్ష పడని చిన్న చిన్న విషయాల్లోనే నిజాయితీగా ఉండటం గొప్ప.
ఇలాంటి సందర్భాలే మన సౌశీల్యాన్ని ఎత్తి చూపేవి. నిత్య జీవితంలోని ఏ వ్యహారంలోనైనా తప్పుగా ప్రవర్తించడం అంటే మీరు నిజాయితీగా ఉండకపోవడాన్ని సమర్థిస్తున్నట్లే. అవి కర్మ బంధానికి దారి తీస్తాయి.
దుష్కర్మలని ఎంతగా తగ్గిస్తే మన తర్వాతి జన్మ అంత ఉన్నతంగా ఉంటుంది. ఇలాంటి చిన్న విషయాల్లో మనం నిజాయితీగా ఉండటం అలవరచుకుంటే అదో సంస్కారంగా మారి మన ప్రవర్తనని తీర్చిదిద్దుతుంది.
No comments:
Post a Comment