161022a1825. 171022-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀667.
నేటి…
ఆచార్య సద్బోధన:
➖➖➖✍️
మనిషి ప్రతీరోజూ ఏదో ఒక సమస్యతో వేదనకు గురవుతూ ఉంటాడు.
ధనవంతులు, పేదవాళ్ళు ,గొప్పవాళ్ళు అనే తేడా లేకుండా నిత్యమూ మానసికంగా లేదా శారీరకంగా చింతాక్రాంతుడై ఉంటుంటాడు.
దీనికి కారణం ఉదయం లేచినప్పుడు మనలో వచ్చిన ఆలోచనలే! రాత్రంతా ఏవేవో దురాలోచనలు, వ్యర్ధ తలంపులు, అనవసర ఆందోళనలు పడుతూ నిద్రపోతే ఉదయం లేవగానే వాటి ప్రభావం చేత రోజంతా ఆ ఆలోచనలే మనసులో తిరుగుతూ శాంతి లేకుండా చేస్తుంటాయి.
ఇది కాదు మనం చేయాల్సింది. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సమస్యల్ని భగవంతునికి వదిలేయాలి. ఆయనను స్మరిస్తూ నిద్రలోకి జారుకోవాలి.
వేకువనే లేవగానే ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో లేవాలి.
ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి.
దీనివలన ఆందోళనలు దూరమై సంపూర్ణమైన మనశ్శాంతి కలుగుతుంది.
మాటల వలన కాదు, అనుభవమే అన్నిటికీ సమాధానం ఇస్తుంది కనుక ఆచరించి చూడండి!. అనుభవంలోకి వస్తుంది.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment