కష్టం-హాయి
బాబు: మిలారేపా కష్టపడి పొందాడని, మనమూ కష్టపడి పొందాలని రూలేమీ లేదు. హాయిగా కూడా పొందవచ్చు....
నిజానికి "పొందటం" అనే క్రియ లేనే లేదు.
యెందుకంటే "అదే నేను" అనే అవగాహన పొందటమే సాక్షాత్కారం.
1. రవి: ఆ అవగాహన వచ్చే వరకు కష్టపడాల్సిదే కదా?
బాబు: జేమ్స్ వాట్ కష్టపడి రైలును కనిపెట్టాడు.
అందులో హాయిగా కూర్చొని ప్రయాణిస్తే చాలు.... మళ్లీ మనం కష్టపడి,,రైలును కనిపెట్టి, ప్రయాణించవలసిన అవసరం లేదు.
సద్గురు వాక్యమే గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణ సాధనం.' '
"పొందటం" అనేది compulsory గా జరిగేదే.
ఆ దిశగానే మన ప్రయాణం సాగేది.
ఆ ప్రయాణాన్నే "జీవితం" పేరుతో మనం అనుభవిస్తుండేది...
నీకు ఇష్టమున్నా లేకున్నా నీ పుట్టుక ప్రయోజనం పూర్తయ్యే తీరుతుంది....అన్న భగవాన్ వాక్కే ప్రమాణం.
వస్తుప్రయోజనం వస్తువుది కాదు,
వస్తువును ఉపయోగించేవానిదే.
అలా భగవంతుని చేతిలో నీవొక పరికరం.
నీ పుట్టుక ప్రయోజనం నీది కాదు; దేవునిది.
మోక్షం అనేది ప్రతి జీవి జన్మహక్కు.
దానికై ఎట్టి ఆందోళనా, ప్రయత్నమూ అవసరం లేదు.
ఈ ఒక్క మోక్షం తప్ప, మిగతా వాటికై కష్టపడండి అవసరమైతే.
ఇదే మోక్షసన్న్యాసయోగం అంటే.
ఏడవకు...
నేనొకడు ఉన్నానని గుర్తుంచుకో చాలు...
నిన్ను ఏ పాపమూ అంటనీకుండా మోక్షమిచ్చే బాధ్యత నాది....
ఇదే భగవద్గీత చరమగీతం.
No comments:
Post a Comment