*గాయత్రీమంత్రము క్రమశిక్షణ నేర్పుతుంది*
సైన్యంలో పనిచేసే వ్యక్తికి రెండు చిహ్నాలు ఉంటాయి. ఒకటి అతడి సంఖ్య. ఉదా: మధ్యప్రదేశ్ రక్షకభటుడు సంఖ్య అని ఒకటి, దానితోపాటు అతడి భుజం చుట్టూ బెల్టు ఉండాలి. అలాగే *మీరు భారతీయులైతే భారతీయ సంస్కృతికి చెందిన రెండు చిహ్నాలు వున్నాయి. అందులో ఒకటి శిఖ రెండవది జంధ్యమూ ఉండితీరాలి.*
గాయత్రీమంత్రరూపంలో మస్తిష్కంపై ఒక అంకుశం ఉండాలి. అంటే మన బుద్ధి, మనస్సులపై ఒక నియంత్రణ అనేది ఉండాలి. అంకుశంలేని ఏనుగు ఎంతటి కష్టాలను, ఇబ్బందినీ కలుగజేస్తుందో మీకు తెలియదు. నియంత్రణలేని మనస్సు అంకుశంలేని ఏనుగు వలెనే ప్రవర్తిస్తుంది.
మానవుడి తెలివి అంత ప్రమాదకారి ఈ ప్రపంచంలో మరేదీ ఉండదు. అందుకే దీనిమీద నిరంతరం నియంత్రణ ఉండాలి. అంకుశం ఉంచిన ఏనుగు బరువులు మోస్తుంది. సవారీ ఇస్తుంది, యుద్ధాలు చేస్తుంది. ఇంకా ఎన్నో రకాలుగా మానవజాతికి ఉపయోగపడుతుంది.
అదేవిధంగా *నియంత్రించబడిన మనస్సు సన్మార్గంలో పయనించి మనకు తగినవిధంగా మేలు కలగజేస్తుంది. అందుకే మస్తిష్కంపైన "నియంత్రణ"కు చిహ్నంగా 'శిఖ' ఉంచబడింది. ఈ శిఖ అనబడే చిహ్నం గాయత్రీరూపమే!* "చిద్రూపిణీ మహామాయే దివ్యతేజ సమన్వితే!' ప్రతివ్యక్తీ తలపైన చెయ్యి పెట్టుకొని 'మనలో తెలివి ఉన్నది. దానిని నియంత్రించుకోవాలి' అని ఆ శిఖను స్పృశించి ధ్యానించాలి.
*ప్రతివ్యక్తికీ అనివార్యంగా విధించబడిన రెండవ చిహ్నం జంధ్యము! నీతి, కట్టుబాట్లు, మానవీయ కర్తవ్యములు, సాంఘిక నియమాల పట్ల క్రమశిక్షణ పాటించటం మనిషి కర్తవ్యం.* మనిషిలోపల 'జంతువు' ఉంటాడు. ఆ జంతువును తాటితో బంధించాలి. "విశృంఖలంగా ఉండరాదు. కట్టుబాట్లకు లొంగి ఉండాలి" - అని 'జంధ్యం' మానవుడిని హెచ్చరిస్తూ ఉంటుంది. ప్రాచీనకాలంలో గాయత్రీమంత్రము విద్యాభ్యాసంకన్నా ముందుగానే పిల్లలకు బుద్ధి వికసించడాని కన్నా ముందుగా నేర్పించబడుతుండేది. ఇది హిందువులకు గురుమంత్రము! అన్ని మంత్రములను 'గురుమంత్రము' అని చెప్పకూడదు. పిల్లవాడిని విద్యాభ్యాసానికి గురువు వద్దకు పంపించినప్పుడు ఆయన ప్రప్రథమంగా అతడికి నేర్పించేది. గాయత్రీమంత్రమే! అందుకే దానిని 'గురుమంత్రము' అన్నారు.
*- యుగఋషి పండిత శ్రీరామశర్మ ఆచార్య* గారి ప్రవచనం నుండి...
_మనం మారుదాం - యుగం మారుతుంది_
No comments:
Post a Comment