Tuesday, October 25, 2022

సరైన ధ్యానం

 .....*సరైన ధ్యానం*.....
        మన పట్ల ఇతరులు మంచిగా వుండటం, ఇతరుల పట్ల మనం మంచిగా వుండటం అనేది మన ప్రవర్తనను బట్టి *వుంటుంది*
      మన ప్రవర్తన మన మానసిక స్థితి ని బట్టి *వుంటుంది.*
      మన మానసిక స్థితి మానసిక కారకాల (factors) మీద ఆధారపడి *ఉంటుంది.*
       ఈ మానసిక కారకాలు రెండు రకాలు.
1)కుశల (మంచి) కారకాలు. ఉదా. ప్రేమ,సకల జీవుల పట్ల దయ,  క్షమాగుణం,కరుణ, స్నేహభావం,సతి, అప్రమత్తత.మొదలగునవి.
2)అకుశల (చెడ్డ) కారకాలు. ఉదా.  ద్వేషం,  కోపం, హింసాత్మకత,  స్వార్థం, పరధ్యానం,  అనైతికత. మెదలగునవి.
    మనస్సు నందు కుశల కారకాలను నింపుకుని,అకుశల కారకాలను నెట్టి వేయడమే నిజమైన,సరైన ధ్యానం.
  
ఇట్లు
జంతువుడు *లేని* జంతువు

No comments:

Post a Comment