Friday, October 21, 2022

వాకింగ్ ఎలా చేయాలి ? ఏ విధంగా వాకింగ్ చేస్తే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

 *శుభోదయం* 🙏

*వాకింగ్ ఎలా చేయాలి ? ఏ విధంగా వాకింగ్ చేస్తే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?*

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామాల విష‌యానికి వ‌స్తే అన్నింటిలోనూ చాలా తేలికైంది, ఖ‌ర్చు అవ‌స‌రం లేనిది.. వాకింగ్‌. రోజూ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే వాకింగ్‌ను కింద తెలిపిన విధంగా చేస్తే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌రి ఆ విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

* వాకింగ్ చేసే వారు రోజుకు క‌నీసం గంట అయినా వాకింగ్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే గంట సేపు వాకింగ్ ఒకేసారి చేయ‌లేక‌పోతే ఉద‌యం, సాయంత్రం 30 నిమిషాల చొప్పున చేయ‌వ‌చ్చు. ఇలా వాకింగ్‌ను సుల‌భంగా పూర్తి చేయ‌వ‌చ్చు.

* వాకింగ్‌ను ప్రారంభించేట‌ప్పుడు నెమ్మ‌దిగా న‌డ‌వాలి. క్ర‌మంగా వేగం పెంచాలి.

* వాకింగ్ కోసం సౌక‌ర్యవంతంగా ఉండే షూస్ ధ‌రించాలి. దీంతో ఎక్కువ సేపు వాకింగ్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

* నడుస్తున్నప్పుడు చేతులను వదులుగా చేసి ముందుకు, వెనుకకు ఆడించాలి. దీంతో శ‌రీరం రిలాక్స్ అవుతుంది. ఎక్కువ వ్యాయామం జ‌రుగుతుంది.

* నడక ప్రారంభించడానికి ముందు నీరు తాగాలి. దీని వ‌ల్ల డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. ఎక్కువ సేపు ఆయాసం రాకుండా వాకింగ్ చేయ‌వ‌చ్చు.

* వేడి వాతావరణంలో కాటన్ దుస్తుల‌ను ధ‌రించి వాకింగ్ చేయాలి. అదే చలి వాతావరణంలో అయితే ఉన్ని దుస్తుల‌ను ధ‌రించి వాకింగ్ చేయాలి. ఇలా వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ‌స్త్రాల‌ను ధ‌రించి వాకింగ్ చేస్తే మంచిది.

* వాకింగ్ చేస్తున్న‌ప్పుడు ఆయాసం వ‌స్తే కొంత సేపు విశ్రాంతి తీసుకుని మ‌ళ్లీ వాకింగ్‌ను ప్రారంభించ‌వ‌చ్చు. అయితే గుండె జ‌బ్బులు ఉన్న‌వారు వాకింగ్ చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎమ‌ర్జెన్సీ ఫోన్ నంబ‌ర్ల‌ను ద‌గ్గ‌ర ఉంచుకోవాలి.

* వాకింగ్ చేస్తే గుండె కొట్టుకునే వేగం పెర‌గాలి. చెమ‌ట ప‌ట్టేట్లు చేయాలి. ఇలా వాకింగ్ చేస్తే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

No comments:

Post a Comment