Monday, October 24, 2022

మీ"మాటల తీరు" ఎలా ఉండాలి? ఎదుటివారి మాటలకు మరి మీ "స్పందన"( అధికమించాలి) ఎలా ఉండాలి?

 *🚩🚩🚩🚩🚩 "మీ"మాటల తీరు" ఎలా ఉండాలి?"
      ❤️❤️❤️
🚩"సమర్పణ & సేకరణ"  : మజుందార్, బెంగళూరు
87925-86125.
       🙏🙏🙏
🚩ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు సమయోచితంగా, సందర్భోచితంగా, భాషా దోషం, భావ దోషం లేకుండా స్పష్టంగా మాట్టాడే    "ప్రజ్ఞను" సంతరించుకోవాలి. 

🚩అది "అభ్యాసం " చేత ఆధ్యాత్మికం చింతన గలవారికి బాగా వస్తుంది.      అది ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకుని తన చుట్టూ ఉన్నవారికి శాంతినివ్వాలి.  "సంస్కృతం పండితులు" వారి వద్దకు పోయి, 
వారి మాటల చాతుర్యము, భాషా పరిజ్ఞానంతో పాటు, మాటల యొక్క సౌందర్యము,
మనకు బాగా అర్థమవుతుంది.

🚩"మాట"   ఎంత శక్తిమంతమయినదంటే ‘‘కడుపున్‌ రంపపు కోత కోయునది గాకుండినన్‌’’ అంటారు. మన పెద్దలు.

🚩ఒక వ్యక్తిని తీసుకొచ్చి పడుకోబెట్టి అటు ఒకరు, ఇటు ఒకరు నిలబడి రంపంతో కోస్తున్నప్పుడు ఏర్పడే ,"గాయం"  బాధ కన్నా ,  ఒక అనరాని "మాట" అన్నప్పుడు ఆ వ్యక్తి జీవితాంతం అది గుర్తొచ్చినప్పుడల్లా పడే బాధ ఎక్కువ!. 

🚩రంపంతో  కోసిన గాయం  కొన్నాళ్ళ తరువాత మానిపోవచ్చు. కానీ  "అనరానిమాట" వినరాని మాట తొందరపడి  నీ నోటి గుండా వస్తే, అంతే  ఆ అవతలి వ్యక్తి పొందే.  బాధ  వర్ణనాతీతము. ఎప్పటికీ పోదు. 

🚩అందుకే "మాట" ఎంత గొప్పదో! సదరు మనం ఆమాటని, ఉపయోగించేటప్పుడు అంత జాగ్రత్తగా, ఆలోచించి మాట్లాడాలి. 



🚩" 3 అంగుళాల నాలిక, 6 ఆరడుగుల మనిషి ని, కూడా  బాధ పెట్టే టట్టు చేస్తుంది!

🚩" మనం మాట్లాడే తీరును బట్టి, ప్రాణము కాపాడుకోవచ్చు! అలాగే
మరొక విధంగా పరుషంగా మాట్లాడితే, ప్రాణాలు పోవచ్చు కూడ!

🚩" మాటలే మనిషికి  శత్రువు.   మాటలే మనిషికి "స్నేహితుడు",
విచ్చుకునే మాట్లాడితే మిత్రుడు చుట్టూ ఉంటారు.   ఆదుపు తప్పి ఎలా మాట్లాడతామో, మనకు శత్రువులు బాగా పెరుగుతారు.   కాలక్షేపం కొరకు నేను మాట్లాడను.
ఎంతటి "కష్ట ప్రసంగాలల్లో" కూడా  నేను  చెడు మాట్లాడను.  

🚩" మీ మాట తీరు బాగుండాలి.  " "గుహ్యమైన " మాటతీరు ద్వారా పుణ్యం కూడా సంపాదించాలి ,  ఆనందం కూడా సంపాదించాలి.

🚩" మీకు "ప్రియమైన" మాటలు చెప్పేవారు, చాలా  సులభంగా దొరుకుతారు.
కానీ  "అప్రియమైన" సరే  చెప్పే వారు నీకు చాలా "దుర్లభం." అని గుర్తించు!

🚩 " సొల్లు" చెప్పే 100 మంది కన్నా, " సొల్యూషన్"  చెప్పే ఒక్కడు  మిన్న.

🚩 మీరు ప్రేమతో,  చిరునవ్వుతో, ఆప్యాయంగా, ఉన్నది ఉన్నట్లు, పూర్తిగా  ఎదుటివారు చెప్పేది విన్న తర్వాత, తెలివి గా, ఆలోచించి, మనసు విప్పి,N.L.P సబ్జెక్టు నేర్చుకున్న మీరు
అర్థం చేసుకుంటూ, మాట్లాడటం అలవాటు చేసుకోండి!

🚩" ఇతరుల గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడవలసి వస్తే, " "మౌనం "వహించాలి.

🚩" నీకు విషయం  తెలియనప్పుడు " మౌనం" వహించు.

🚩" నోరు జారిన "మాట" ఎగిరిపోయిన పక్షి లాంటిది.   చెప్పవలసిన విషయం సూటిగా చెప్పలేని వారు "వాసనలేని పుష్పగుచ్చం" వంటి వారు.

🚩" మీ మాట్లాడే తీరు, మీ మాటలు చెబుతాయి, ఎదుటివారు మీ స్వభావాన్ని అంచనా వేయగలరు.  మీ యొక్క స్వభావం  ఏమిటో?

🚩" మీ మాటకు విలువ ఉండాలి అంటే ,నీ నాలుక నీ ఆధ్వర్యంలో ఉంచుకో!

🚩" మీ మనసులోని మాటను ఏ భేషజాలు, హిపోక్రసీ, లేకుండా చెప్పాలి.   మీ మాట కరెక్ట్  గా ఉన్న , మీ ఉన్నతమైన భావాలతో ఆప్యాయంగా, పలకరించాలి.

🚩" నీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడే వారి గురించి మీరు ఆలోచించవద్దు. ఎందుకంటే వారి స్థానం, ఎప్పుడు మీ వెనకే అని గుర్తించండి!

🚩" ఈ నోటి "మందబుద్ధి" నుండి " బుద్ధి వైకల్యం" గల మాటలు వద్దు.   అసంబద్ధమైన మాటలు పనికిరావు.

🚩"కుప్త్తం గా స్పష్టం గా మాట్లాడలేని  వారు, ఎక్కువగా మాట్లాడకూడదు. 
ప్రతి పదం ఆచి,తూచి మాట్లాడు.  అర్థవంతమైన మాటలు మించిన "ధర్మం" ఎన్నడూ లేదు.

🌷" నీ నోటి "మాట మంచిదైతే,"  నీవు కోటి జనాల మనసులో హత్తుకుని నీవు నిలుస్తావు, లేదా వారిలో "చులకన "అవుతావు.

🔥" నీ నోటి మాటలు"
" బంధాలు కలిపేవి అవే-- బంధాలు తెంచుతాయి అవే."

" గాయాలు చేసేది -- మాన్పించేది అవే."

" ప్రాణాలు పోసేది -- 
ప్రాణాలు తీసేది అవే.,"

" నిన్ను గెలిపించేది-- 
నిన్ను ఓడించేది అవే"

" ఎదుటి మనిషిని "మెప్పించవచ్చు" --
" నొప్పించవచ్చు"

      " మాటకి ఎంత
శక్తి ఉన్నదో తెలుస్తుంది కదా! కనుక జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి."

🌷" ఎదుటివారి మాటలకు మరి మీ "స్పందన"( అధికమించాలి) ఎలా ఉండాలి?

🥁" ఒక్కొక్కసారి ఇతరులు నీ గురించి కావాలని కల్పించి, సృష్టించి," మాట్లాడే చెడు మాటలు"  నీ పాదాలకు అంటుకున్న " దుమ్ము" లాంటిది.    దానిని "దులుపుకొని"  ఉన్నత స్థితికి  పోవాలే తప్ప నీ నుదుటికే  రాసుకోవద్దు సుమా!
🥁" ఒక్కొక్కసారి విలువ లేని "దుమ్ము "కూడా నీ కంట్లో పడి విలవిలలాడేలా చేస్తుంది.
అలాగే విలువ లేని మనుషులు తమ "కఠినమైన నిష్ఠురపు" మాటలతో బాధ పెడతారు.   ఉదేసుకుని ముందుకు వెళ్ళటం "ఉత్తమ పురుష"  లక్షణం.

🥁" నీ కండలో బలము ఉంటే పదిమందిని కొట్టగలవేమో!  కానీ నీ "మాటలలో సున్నితత్వం" ఉంటే ఆ  నీ యొక్క మంచితనంతో,  వేల మంది గుండెల్లో మంచి ఉన్నత స్థానము సంపాదించుకోగలవు కదా!( తెనాలి రామ కృష్ణుడు గురించి తెలుసు కదా)

🥁" నిన్ను "మాటలతూటాలతో"  పరుషమైన మాటలతో బాధ పెట్టాలా ప్రవర్తించారని నీవు బాధపడకు.  అసలు విషయము వారికి తెలియక  బాధ పెడితే క్షమించు!  లేదా తీర్పును కాలానికి వదిలి, నీవు ప్రశాంతంగా హాయిగా ఉండు!

🥁" నది ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి!  కానీ నదిలో ఈదే వాడి ఆలోచనలు మరోలా ఉంటాయి కదా!
మీ మాట యొక్క విలువ, దానిపట్ల గౌరవం, మర్యాద, నీ యొక్క సంస్కారము మీద, నీ యొక్క విద్యగురువు మరియు తల్లిదండ్రుల పెంపకం, 
నీ యొక్క సహచరులు ( మిత్రులు) నీవు పెరిగిన చుట్టుపక్కల వాతావరణం మీద ఆధారపడి ఉండును.  కనుక జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి.

"మజుందార్, బెంగళూరు"
🚩🚩🚩🚩🚩🚩🚩

No comments:

Post a Comment