Friday, October 21, 2022

పూజలో… “పత్రం పుష్పం ఫలం తోయం...." అంటుంటాము. అయితే ఈ నాల్గింటి యొక్క అర్థము ఏమిటి? భగవంతునికి యేది అర్పితము చేయాలి? ప్రాచీనులు ఎట్టి అంతరార్ధముతో బోధించారు?

 201022a2154.    211022-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀671.
నేటి… 

              ఆచార్య సద్బోధన: 
                   ➖➖➖✍️


పూజలో…  “పత్రం పుష్పం ఫలం తోయం...." అంటుంటాము. అయితే ఈ నాల్గింటి యొక్క అర్థము ఏమిటి? భగవంతునికి యేది అర్పితము చేయాలి? ప్రాచీనులు ఎట్టి అంతరార్ధముతో బోధించారు? 

పత్రం - దేహము, పుష్పం - హృదయ పుష్పము, ఫలం -మనోఫలము, తోయం - ఆనందబాష్పములు. ఇందులో ఏదైనా ఒకటి అర్పితము చేయమన్నారు. 
అంతేగాని వాడిపోయే పుష్పాలను కాదు.
ఈ ఫలములు దైవమునకు అవసరము లేదు. అయనకు యివ్వవలసినది యేమిటి? ప్రేమఫలము. కానీ, అది అభిమాన మమకారములనే చేదుతోలుచేత కప్పబడి ఉంటున్నది. ఆ చేదుతోలును విడదీసి, మధ్యలోనున్న వాంఛలనే విత్తనములను వేరుచేసి, మధురమైన ఆ గుజ్జును, ఆ ప్రేమరసమును మాత్రమే భగవంతునికి అర్పించాలి. అదే నిష్కామ ప్రేమ. అట్టి ప్రేమయే భగవంతుడు కోరే ఫలము.

మిగిలినవన్నీ మలినమైనవి. పరిశుద్ధములైన మనోభావాలను అర్పించక ఇట్టి మలినమైన వాటిని అర్పించినా పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు..✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment