♨️సూక్తులు_ జీవన నిత్య సత్యాలు♨️
💯కష్టపడే వారికి తప్పకుండా ఫలితం వష్తుంది.
💯వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగించినట్లు, నిరంతరం నేర్చుకొనే వారే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలరు.
💯మనకు దురదృష్టాన్ని కలిగించేది మరేంటో కాదు, మనం వృథా చేసిన కాలమే.
💯ఎవరి తప్పులు వారు తెలుసుకోవడంలో తప్పులేదు.
💯తప్పులు చేస్తున్న వాళ్ళు తమనెవరు గమనించడం లేదనుకుంటారు.
💯నిప్పు అప్పు పగ ఈ మూడు తమంతట తాము తరగవు పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పుని ఆర్పాలి అప్పుని తీర్చేయాలి పగను సమూలంగా తుంచేయాలి. వీటిని ఏమాత్రం మిగలనిచ్చినా మళ్ళీ వృద్ధి చెందుతాయి.
💯ఏ కారణం లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం పొందబోతున్నావన్న మాటే, అకారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది.
💯మనం ఆనందంగా ఉండటానికి అత్యంత సులువైన మార్గం ఇతరుల్ని ఆనందంగా జీవించేలా చేయడమే.
💯వ్యర్థమైన మాటలు వెయ్యి చెప్పడం కన్నా శాంతిని ప్రసాదించే ఒక మంచి వచనం చాలు.
💯మర్యాద ఇవ్వడం వలన ఎవరూ ఏమీ నష్టపోరు.
✒️సేకరణ
💞విప్పోజు శ్రీనివాస చారి విశ్వకర్మ 💕
No comments:
Post a Comment