*Everything you know about depression could be wrong& డిప్రెషన్ లో మీరు ఉంటే ఏమి చేయాలి ఎలా డిప్రెషన్ OCD తగ్గిచాలిఅవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*
విద్య లేని వాడు వింత పశువు అన్నారు. కానీ ఈ నాటి పరిస్తితి చూస్తుంటే పశువులే నయము అనిపిస్తుంది.
డిప్రషన్ వలన జీవితం గురించి సరైన అవగాహన లేక చాలామంది ఆత్మ హత్యలు చేసుకుంటుంటే,మనం వాటిని రాజకీయ పరంగా ఉద్దేషించి మనకుతెలియకుండానే ఎంతో మంది యువకుల ఆత్మహత్యలను ప్రోత్సహిస్తున్నాం. దీనికి సరైన అవగాహన ఉంటే సరిపోతుంది.
సైన్స్ చదువుతున్నారు కానీ సెన్స్ ఉండటంలేదు. ఆసిడ్ అటాక్స్,కిర్కెట్ బెట్టింగ్స్, టెన్త్ క్లాస్ లోనే ప్రేమాయనాలు. జర బద్రం బ్రదర్స్.
వేచి చూడటం వలన వచ్చే అవకాశాలు చాల గొప్పవి. తొందర పడకండి.https://m.facebook.com/story.php?story_fbid=2170670309864509&id=1536735689924644
కౌంటర్ డిప్రెషన్
````````````
సైకాలజీలో కొన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తే కొన్ని విషయాలు వింతగా అనిపిస్తాయి. సాధారణంగా డిప్రెషన్ కి గురయిన వారు సైకాలజిస్ట్ సహాయంతో దానినుండి బయటపడతారు. అయితే వీళ్ళను డీల్ చేసే సైకాలజిస్ట్/కౌన్సెలర్/థెరపిస్ట్ లకు కొన్ని సార్లు వింతయినా పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. డిప్రెషన్ కి గురయిన వ్యక్తులతో గడిపి, గడిపి, వాళ్ళు చెప్పే విషయాలను ఎంపతీ తో వినటం వల్ల కొన్ని సార్లు క్లయింట్ కి ఉన్న డిప్రెషన్ సైకాలజిస్ట్ కి ట్రాన్స్ఫర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దీని పట్ల సైకాలజిస్టులు చాల అప్రమత్తంగా ఉండాలి.
కాన్సెలింగ్ అంటేనే శ్రద్దగా వినటం. క్లయింట్ చెప్పే అనేక విషయాలను సైకాలజిస్ట్ శ్రద్దగా, ఎంపతీ తో వినవలసి ఉంటుంది. అలా వినే సమయంలో సైకాలజిస్ట్ తనకు తెలియకుండా క్లయింట్ మానసిక స్థిలోకి జారుకుంటారు. ఏపంతీ తో వినటం వల్ల ఈ విధంగా జరుగుతుంది. ఎంపతీ లేనట్లయితే కౌన్సెలర్ క్లయింట్ ప్రాబ్లెమ్ ని సరిగ్గా అర్థం చేసుకోవటం జరగదు. ఈ విధంగా రోజుల తరబడి డిప్రెషన్ కి లోనయిన క్లయింట్స్ ని వినటం వల్ల సైకాలజిస్ట్ కూడా డిప్రెషన్ కి లోనయ్యే అవకాశాలు ఉంటాయి.
చాల సందర్భాలలో నేను కూడా ఇటువంటి అనుభవం పొందాను. కొన్ని కేసులు డీల్ చేసేటపుడు క్లయింట్స్ తమ బాధలు పంచుకుంటున్నపుడు నేను వారిలో మానసికంగా కలసి పోయిన సందర్భాలు చాల ఉన్నాయి. ఆ రోజు రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడటం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో సాధారణంగా సైకాలజిస్ట్ కొంత గ్యాప్ తీసుకోవటం, లేదా మరి సైకాలజిస్ట్ ని సంప్రదించడం ద్వారా తన డిప్రెషన్ నుండి బయట పడి తిరిగి విధులకు హాజరుకావటం జరుగుతుంది. చరిత్రలో చాల మంది ఫేమస్ సైకాలజిస్ట్ లు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి.
డిప్రెషన్ లక్షణాలు :
విపరీతమయిన చిరాకు, నిర్ణయాలు తీసుకోలేక పోవటం, జీవితం మీద విరక్తి రావటం, మనుషుల పట్ల అనుమానాలు పెంచుకోవటం, సెల్ఫ్ ఎస్టీమ్ ని కోల్పోవటం వంటి మానసిక మయినవే కాకుండా నిద్ర పట్టక పోవటం, సరిగా ఆహరం తీసుకోలేక పోవటం, శరీర భాగాలలో విపరీతమయిన నొప్పిని ఫీలవటం, స్త్రీలలో రుతుక్రమంలో మార్పులు రావటం, పురుషులలో సెక్స్ పట్ల ఆసక్తి (LIBIDO) కోల్పోవటం వంటి శారీరక లక్షణాలను గమనించవచ్చు.
బయటపడే మార్గాలు :
కౌన్సిలింగ్ తో పాటుగా ఇతర మార్గాల ద్వారా కూడా డిప్రెషన్ నుండి బయట పడవచ్చు. తానూ ఉంటున్న ప్రాంతం నుండి మరో ప్రాంతం కు వెళ్ళటం, టూర్స్ వెళ్ళటం, యోగ, వ్యాయామం వంటివి అలవర్చుకోవటం. పెయింటింగ్, డాన్స్, సింగింగ్ వంటి సృజనాత్మక మయిన కళల ను అభ్యసించడం ద్వారా కూడా డిప్రెషన్ నుండి బయట పడ వచ్చు
*ఒత్తిడి తగ్గడానికి యోగా ఓ ఉత్తమ మార్గం..*
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఒత్తిడికి లోనవుతుంటారు. ప్రస్తుత రోజుల్లో తీరికలేని ఒత్తిడితో కూడిన జీవితం ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నది. జీవితంలో వివిధ కారణాల వల్ల మనం తరచూ ఒత్తిడికి గురి అవుతూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాము. ఒత్తిడికి గురైన వారు ప్రశాతంగా నిద్రపోలేకపోతున్నారు. ఏదో ఆందోళన, భయం, డిప్రెషన్ వల్ల ఆరోగ్యం మీద చెడు ప్రభావాలు చూపుతున్నాయి. ఈ ఒత్తిడి తగ్గించుకొనేందుకు ఒక ఉత్తమ మార్గం ఉన్నది అదే యోగా.
ప్రతి రోజు యోగా చేయడం వల్ల ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు .
యోగా వల్ల శరీరంలోని అవయావాలు విశ్రాంతిపొంది, జీవితం ఆనందంగా ముందుకు నడవడానికి సహాయపడుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆందోళన మరియు ఒత్తిడి రెండూ ఏదో ఒక సందర్భంలో కలిగి ఉంటారు. అయితే, ఈ రెండు లక్షణాలను దీర్ఘకాలం పాటు అలాగే ఉంచుకోకుండా, ఏమాత్రం ఒత్తిడి యొక్క లక్షణాలను కనిపించినా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎప్పడైతే అధిక ఒత్తిడికి గురైతే, కార్టిసోల్ అనే హార్మోన్ రక్తకణాల్లో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మీ శరీరాన్ని మరింత నాశనం చేస్తుంది. జీవక్రియల ప్రక్రియను తగ్గిస్తుంది మరియు రక్తపోటు పెరిగి గుండె మీద ఒత్తిడి పెంచుతుంది. ఈ హార్మోన్ యొక్క ప్రభావం నుండి బయటపడాలంటే ఒత్తిడి నుండి ఉపశమనం పొందాలి. అందుకు యోగా అద్భుతంగా సహాయపడుతుంది. యోగా, వ్యాయామం కంటే మరింత ప్రయోజనకారి గా ఉంది. యోగా వల్ల శరీరంలోని ప్రతి ఒక్క అవయవానికి కదలిక కలిగి ఉంటుంది. ప్రతి ఒక్క అవయవం, కండరాలు కదలిక వల్ల జీవక్రియలు చురుకుగా పనిచేయడం మాత్రమే కాదు, ఒత్తిడి కూడా చాలా త్వరగా తగ్గిస్తుంది. మనస్సు ప్రశాంతపరుస్తుంది .
ఒత్తిడిని తక్కువగా అంచనా వేయకుండా వెంటనే యోగా ప్రాక్టిస్ చేస్తూ మీలో ఉన్న ఒత్తిడిని పారద్రోలండి… ఒత్తిడి నుండి ఉపశమనం కోసం
యోగా : సుఖాసన: ఒత్తిడి తగ్గించుకోవడంలో ఇది ఒక సలుభమైనటువంటి యోగాసనం. పద్మాసనంలో కూర్చొని, తర్వాత కాళ్ళను రెండింటిని పైకి మడవాలి. తర్వాత మనస్సును ప్రశాంత పరుచుకోవాలి. శ్వాసనెమ్మదిగా పీల్చి వదలడం వల్ల మనస్సు ప్రశాంతపడుతుంది. అంతే కాదు, వెన్నెముకకు విశ్రాంతి లభిస్తుంది.
ప్రాణాయామం: ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, నిశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు. శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు.
నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటిలో ప్రాణం సంచరిస్తూ ఉంటుంది. ప్రాణాయామం వల్ల వాట న్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే '' ప్రాణా యామేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్' అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరో గాలు హరించిపోతాయి అనే సూత్రం ప్రచారం అయ్యింది. నిత్యం బిజీ లైఫ్ లో వారి దినచర్యలో భాగంగా ఎదో సమయంలో ఒత్తిడికి లోనవుతుంటారు
అలాంటి వాటిని నివారించేందుకు యోగా ఎంతో ఉపకరిస్తోందని యోగా గురువులు
*పొట్ట దగ్గర పెరిగే కొవ్వును తగ్గించడానికి*
పొట్ట దగ్గర అసలు కొవ్వు ఎందుకు పెరుగుతుంది? అసలు యోగాసనాల ద్వారా దానిని తగ్గించవచ్చా? అయితే ఎలాంటి ఆసనాలు వేయాలి? ఈ సమస్యలకు సమాధానం తెలుసుకుందాం. చాలా మందికి పొట్ట దగ్గర కొవ్వు పెరగడానికి కారణం ఫాట్, మనం రోజు తీసుకునే ఆహారంలో తీసుకోవలసిన దానికన్నా ఎక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవడం, తగినంత శ్రమ చేయకపోవడం, దీనితో ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది. కాలరీలు ఖర్చు కాకపోవచ్చు, జన్యు పరమైన కారణాలతో ఆకలి జీవక్రియలో మార్పిడి సంభవించి ఊబకాయానికి దారి తీస్తుంది. ఈ ఊబకాయం మరికొన్ని సమస్యలకు దారితీస్తుంది. వాటిలో నిద్రలేమి, సిఓపిడి, పిసిఓడి, ఊపిరితిత్తులసమస్యలు, కరోనరీఅప్టెనరీ, మధుమేహం, డిప్రెషన్, హైకొలస్ట్రాల్, స్ట్రోక్లకు దారి తీస్తుంది.
*మకరాసనం*
:మొదట ఈ ఆసనం లో పడుకొని చేయవలసినవి.
*అర్ద ధనురాసనం*
: ఈ అర్ద ధనురాసనాన్ని రోజుకు 10 సార్లు చేయాలి.
*అధోముఖసరాసన*
: ఈ అధోముఖస్వనాసన రోజుకు 10 సార్లు చేయాలి.
*శలభాసనం* :
ఈ శలభాసనం రోజుకు 10 సార్లు చేయాలి.
*చాలాన కపోతాసనం :* చాలాన కపోతాసనం రోజుకు 10 సార్లు.
ఈ ఆసనాలన్నింటిని శ్రద్ధ గా చేస్తే పొట్ట దగ్గర పెరిగే కొవ్వును మి నవీన్ నడిమింటి
*యోగా" వలన "పురుషుల" కి కలిగే ఉపయోగాలు*
యోగా అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తుంది..ఎంతో మంది మానసిక రుగ్మతలకి యోగా ఎంతో చక్కటి పరిష్కారాన్ని చూపించింది..మనిషి కి ఉండే ఎన్ని అనారోగ్య సమస్యలకి యోగా ద్వారా పరిష్కారం దొరుకుతుంది..యోగా ని నమ్మని వారికోసం ఎంతో మంది వీటిని శాస్త్రీయంగా కూడా పరీక్షలు చేసి మరీ రుజువు చేశారు..వారి పరిసోధనల్లో తెలిసిన విషయం ఏమిటంటే యోగా ఎంతో శక్తివంతమైనది..ఎంతో అద్భుతమైన శక్తి కలదని..అయితే
యోగా వలన పురుషులలో బలాన్ని, శక్తి మరియు వశ్యతను మెరుగుపరుస్తుంది.
ఈ వ్యాయామాలు శరీర అభివృద్ధితో పాటు, కండరాలు మంచి ఆకృతి సంతరించుకునేలా సహాయపడతాయి. అంతేకాకుండా, ఈ యోగాసనాలను అనుసరించటం వలన శరీర బరువు తగ్గటమేకాకుండా, శరీరం😜 😜 సమతుల్యతంగా నిర్వహించబడుతుంది.
.
యోగాసనాలు మీలో పునరుద్దరించటం లేదా శక్తి స్థాయిలను మెరుగుపరచటం మరియు సంతోషంగా ఉంచే 'ఎండార్ఫిన్' హార్మోన్ ల విడుదలను ప్రోత్సహిస్తాయి...ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనిషిని పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉంచే ఒకేఒక్కటి అదే యోగా...అయితే అధిక తీవ్రతగల వ్యాయామాలు మరియు ఎక్కువ సమయం పాటు జిమ్ లో వ్యాయామాలను చేయటం వలన శరీరంలో 'లాక్టిక్ ఆసిడ్' కండరాల నిర్మాణానికి తోడ్పడుతుంది.
కానీ, యోగ వ్యాయామాల తరువాత విడుదలయ్యే అధిక లాక్టిక్ ఆసిడ్ ను శరీరం నుండి భయటకు పంపి, ఒత్తిడి మరియు టెన్షన్ ల నుండి ఉపశమనం కలిగిస్తుంది...దాంతో శరీరం అలవాకపోయినా సరే మనిషి ఎంతో ధృడంగా ఉంటాడు..అయితే ప్రస్తుతకాలంలో, ఒత్తిడి అనేది చాలా మంది పురుషులకు ఒక పెద్ద సమస్య మరియు చాలా మంది ఒత్తిడి వలన వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఫలితంగా, ఏకాగ్రత తగ్గి, ఆహార సేకరణలో లోపాలను కలిగించి మరియు నిద్ర లేకుండా చేస్తుంది.
యోగా భౌతికంగా మరియూ పూర్తీ ఆరోగ్యంగా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది..కానీ, రోజు యోగ అనుసరించే వారిలో మాత్రమే ఈ రకమైన ప్రయోజనాలను పొందవచ్చు. సహనంతో, సమయాన్ని కేటాయించటంతో పాటుగా, చుట్టూ ఉండే వారిలో మీతో సమాన అభిప్రాయాలు గల వారితో యోగ అనుసరించటం ద్వారా యవ్వనంగా ఉంటారు...ఎంతో మంది ఋషులు ఏళ్ల తరబడి బ్రతికి ఉన్నా సరే వారికి శరీరం ఎంతో దృడంగా ఉంటుంది దానీ కారణం ఒక్కటే యోగా..అందుకే యోగాని నిత్య జీవితంలో ఒక అలవాటుగా మార్చుకుంటే ఎంతో ప్రశాంతమైన ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తమి
-ధన్యవాదములు 🙏🏻
నవీన్ నడిమింటి
9703706660
మరింత సమాచారం కొరకు మా హెల్త్ లింక్ లౌ చుడండి 👇👇👇👇👇👇👇
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
*సభ్యులకు సూచన*
*************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..
.
No comments:
Post a Comment