Tuesday, October 25, 2022

అనుభూతి vs అనుభవం

అనుభూతి vs అనుభవం
అనుభూతి వర్తమాన కాలానికి చెందినది.
మనోశారీరక వ్యవస్థ మొత్తంగా ఈ అనుభూతి చెందుతూ ఉంటుంది. గుర్తించడం గాని, అనుభూతి చెందుతూ వున్న వాడు గాని లేని, వర్తమానలో కొనసాగుతూ ,కేవలం అనుభూతి మాత్రమే వుండి మరొక క్రియ లేని ఎప్పటి కప్పడు దొర్లి పోతూ వుండే క్షణిక స్థితి.
అనుభవం అంటే అనుభూతి కలిగిన తర్వాత అది నమోదు కాబడి జ్ఞాపకం గా మారి తిరిగి జ్ఞప్తికి తెచ్చుకుంటూ వుండేది.
అనుభూతి వర్తమానంది అయితే అనుభవం గతానిది.
అనుభూతి చెందకుండా అనుభవం ఏర్పడదు.
అనుభూతి ని సొంతం చేసుకోలేము.
అనుభవంని నా సొంత అనుభవం అని అంటాం
అనుభూతి.ఒంటరిది.ఇది సత్యం.
అనుభవం, అనుభూతిని + నమోదు (recording)ని ,+ గుర్తించడంని + జ్ఞప్తికి తెచ్చుకోడాన్ని +
,నేను ,నాది అనే భావనను + కాలాన్ని కలుపు కొనిన భావన మాత్రమే.

ఇట్లు
అనుభూతి చెందుతూ వున్న వాడు లేని అనుభూతి.

No comments:

Post a Comment