Saturday, November 12, 2022

🕉💐సృష్టి-పరమాత్మ💐🕉 సాధారణంగా సృష్టిని గురించి 3 వాదాలున్నాయి.

 🕉💐సృష్టి-పరమాత్మ💐🕉

సాధారణంగా సృష్టిని గురించి 3 వాదాలున్నాయి.

1. ఆరంభవాదం :- మనం మట్టిని తెచ్చి బొమ్మలు చేసినట్లు భగవంతుడు పరమాణువు మొ॥ న సామాగ్రితో ఈ సృష్టి చేశాడని చెప్పటం ఆరంభవాదం. ఇది సామాన్యులకు అర్థమయ్యేందుకు చెప్పేదే గాని సత్యం కాదు. కారణం? భగవంతుని కన్న వేరుగా ఏ పరమాణువు ఉండే వీలులేదు గనుక.

2. పరిణామవాదం :- పాలు తోడువేస్తే పెరుగైనట్లు భగవంతుడే ఈ జగత్తుగా మారిపోయాడు అని. ఇది మధ్యములకు చెప్పేది. కానీ ఇదీ సత్యం కాదు. కారణం? పాలు పెరుగైతే ఇక పాలు ఉండవు. అలాగే పరమాత్మ జగత్తుగా మారితే ఇక పరమాత్మ ఉండే అవకాశం లేదుగదా!

3. వివర్తవాదం :- తాడు తాడుగానే ఉండి చీకటి వల్ల పాముగా కనిపించినట్లు పరమాత్మ పరమాత్మగానే ఉండి అజ్ఞానం వల్ల ప్రపంచంగా - జగత్తుగా కనిపిస్తున్నాడు అనేది వివర్తవాదం. ఇదే సత్యం. ఇది ఉత్తమ సాధకులకు చెప్పే విధానం. జగత్తు కనిపిస్తున్నా ఉన్నది పరమాత్మే. జగత్తు అదృశ్యమైనా ఉన్నది పరమాత్మే. 

'బ్రహ్మ సత్యం జగన్మిధ్య' అనేది ఇందుకే. కనిపించని పరమాత్మ సత్యం. కనిపించే జగత్తు మిథ్య. అంటే లేదని కాదు. అజ్ఞానం వల్ల 'లేకపోయినా కనిపిస్తుంది' – అని. జగత్తుగా కనిపించేది యదార్థంగా పరమాత్మే. 
ఇలా ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విధంగా చెప్పటం జరుగుతుంది. ఏది ఏమైనా జగత్తు యొక్క సృష్టికి కారణం పరమాత్మే. 

🕉🕉💐💐💐💐💐🕉🕉 

No comments:

Post a Comment