*::: ధ్యానం అంటే విసర్జన:::*
ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో,ఎంత సహజమో
ఎంత సౌఖ్యమో, విసర్జన కూడా అంతటిదే .
భౌతిక విసర్జన మనకు ఇష్టం వున్నా లేకున్నా,అప్రయత్నంగా
జరిగి పోతుంది. కాని
మానసిక విసర్జన అలా కాదు.
*మానసిక విసర్జన అనగా ఏమిటి ???*
మనం అనేక మానసిక విషయాలు( నచ్చడం, నచ్చక పోవడం), బోలుడంత జ్ఞానం సంపాదిస్తాం,(అభిప్రాయాలు, విశ్వాసాలు) కావాల్సినంత మానసిక జ్ఞాపకాలు(నాకు అలా అయింది,ఇలా అయింది) పోగుచేస్తాం, అనేక అనుభవాలు (భయాలు, చికాకులు, ఆందోళన)అందుకుంటాం,
ఇవన్నీ వర్తమాన మానసిక, స్వేచ్ఛా జీవితానికి ఉపయోగపడవు. పైపెచ్చు అడ్డు పడతాయి.
కనుక మరచి పోవాలి. నెమరు వేసుకోరాదు. ప్రాముఖ్యత ఇవ్వరాదు. అప్పుడు తొలగిపోతాయి. అనగా విసర్జించినట్లే .
అపుడే జీవితం నూతనంగా, తాజాగా, యవ్వనంగా, పునః నిర్మితం అవుతూ వుంటుంది. *ధ్యాన స్థితికి ఏదీ అంటదు*
*షణ్ముఖానంద9866699774*.
No comments:
Post a Comment