[11/16, 04:45] +91 73963 92086: *కాశీ ఖండం - 18*
🕉️⚜️🔱⚜️🔱🔱⚜️🔱⚜️🕉️
🙏 *ధ్రువ చరిత్ర* 🙏
💫 శివశర్మ; విష్ణుగణాలను..... ‘’ఏకపాదం మీద నిలిచి, ఏదో ఆలోచిస్తున్నట్లు, కాంతుల చేత ముల్లోకాలకు మండప స్థంభం వంటి వాడుగా, కాంతులు వెదజల్లుతూ, అనంతతేజోవిరాజంగా ఉన్న ఆకాశంలో సూత్ర ధారిలా, దాన్ని కొలుస్తున్న వాడిలా, యూపస్థంభంలా నిలబడి ఉన్న ఈ మహా పురుషుడు ఎవరు?’’అని ప్రశ్నించాడు.
💫 ఆ మహనీయుడే ధృవుడు అని చెప్పి, ధ్రువ చరిత్ర ను తెలియజేశారు.
💫 స్వాయంభువునకు, ఉత్థానపాదుడనే కుమారుడున్నాడు. అతనికి సురుచి అనే భార్య వల్ల, ఉత్తముడు అనే పెద్ద కొడుకు, సునీతి అనే భార్య వల్ల, ధృవుడు అనే చిన్న కొడుకు, కలిగారు.
💫 ఒక రోజు సునీతి ఏదో పనిలో ఉండి, తనకుమారుడు, ధృవుడిని, సర్వాంగ సుందరంగా అలంకరించి, దాసికిచ్చి, రాజు దగ్గరకు పంపింది. అతను తండ్రికి నమస్కరించి, నిలబడ్డాడు. అప్పటికే ఉత్తముడు, రాజుగారి తొడ మీద కూర్చుని, రాజసం ఒలక బోస్తున్నాడు. బాల్యచాపల్యం చేత, ధ్రువుడు కూడా, తండ్రి తొడ మీద, కూర్చొనే ప్రయత్నం చేస్తూ, కాళ్ళ మీద నుంచి, పాకుతున్నాడు. అప్పుడు, చుప్పనాతి సురుచి, ‘’నువ్వు బాలిసుడివి. మహారాజు అంకాన్ని చేరే అదృష్టం, నీకు లేదు. అభాగ్యురాలి గర్భంలో జన్మించావు. నేలమీద పాకే నువ్వెక్కడ? సింహాసనం మీద కూర్చునే ఉత్తముడెక్కడ ?’’
అని లాగి పారేసింది. రాజు కూడా, ఏమీ అనలేకపోయాడు. కానీ లోపలికి పోయి, కన్నీళ్లు పెట్టుకొన్నాడు రాజు.
💫అమాయకుడైన ధ్రువుడు, ఏమీ చేయలేక, తండ్రికి నమస్కరించి, తల్లి సునీత వద్దకు చేరి, ఏడ్చాడు. తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం, తనకు ఎందుకు కలగలేదని, ఆ అర్హత సంపాదించటానికి తానేం చేయాలని, అడిగాడు. అప్పుడు తల్లి, ‘’నాయనా ధృవా ! సురుచి మానవతి అయిన భార్య. ఆమె అంటే, రాజుగారికి అభిమానం ఎక్కువ. నా దురదృష్టం వల్ల నేను ఆయన ప్రేమకు ఎక్కువగా నోచుకోలేకపోయాను. పుణ్యవశం చేత, ఉత్తముడు, ఆమె గర్భంలో జన్మించి, రాజయోగ్యుడైనాడు‘’ అని చెప్పి, పుణ్యం రావాలంటే, ఎలా వస్తుందో, వివరించింది.
💫 సాత్వికమైన మనస్సు, దయాదృష్టి, శివ పూజ, శాస్త్ర జ్ఞానము, చదువు,
అరిషడ్వర్గాలను జయించటం, తియ్యని మాట, పనులలో శ్రద్ధ , అలస్యం చేయక పోవటం, గురుభక్తీ, నిష్కాపట్యం , దైన్యం లేని సంభాషణ, శబ్ద పాండిత్యం,
బంధుగణాలను ఆదరించటం, క్రయ విక్రయాలలో కఠినత్వం, భార్యతో మృదువుగా మాట్లాడటం, తీర్ధాలు సేవించటం, యుద్ధంలో వీర మరణం, పిల్లల మీద వాత్సల్యం, యాచకులకు, వికలాంగులకు, దానం చేయటం , తల్లి దండ్రుల సేవ , నిత్య ధర్మాచరణ, ఉత్తమ శీలం, మంచివారితో స్నేహం, ఇతిహాస పురాణాలను వినటం, ఆపదలలో ధైర్యం, సంపద చేరినపుడు స్తైర్యం, యతీశ్వరుల యెడ ఔదార్యం, దేహాన్ని కృశింప జేసుకోవటం, ఇంద్రియ జయం, తపో నియమం అనే ఉత్తమ గుణాల చేత, తపోవృక్షం ఫలిస్తుంది. నువ్వు రాజుగారి కుమారుడవే, కాని, విశేష పుణ్యం చేయలేదు. నువ్వు చేసిన కర్మ కు, తగిన ప్రతి ఫలమే లభిస్తుంది. కనుక దుఖించకు అని ఓదార్చింది.
💫 తల్లి సునీతి మాటలు విన్న ధ్రువుడు, ‘’అమ్మా !నేను బాలుడిగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. ఉత్తానపాద రాజుగారి కుమారుడిని కనుక, తపస్సు చేస్తాను. తపస్సు సర్వసంపదలకు కారణం కదా. ఎవరికీ లభించనంతటి గొప్ప పదవిని, నేను సాధిస్తాను. నన్ను ఆశీర్వదించి పంపించు" ‘అని కోరాడు. అప్పుడామె,
💫 ‘’ధ్రువా ! నీకిప్పుడు తోమ్మిదేళ్ళే. నీకు ఆజ్ఞ ఇచ్చే సమర్ధత నాకు లేదు. కానీ నీ మనోనిశ్చయం నాకు సంతృప్తినిచ్చింది. కన్నీటితోనే నిన్ను తపస్సుకు అంగీకారిస్తున్నాను‘’ అని ఆశీర్వదించి పంపింది.
💫 ధ్రువబాలకుడు అక్కడి నుండి బయల్దేరి, నిర్జరారణ్యం ప్రవేశించాడు. దారిలో సప్తర్షుల దర్శన భాగ్యం కలిగింది. వారికి నమస్కరించాడు. తన చరిత్ర అంతా వారికి దీనంగా వివరించి, వారి మనసులను దోచాడు. అతడి కోరిక ఏమిటని, అడిగారు. అప్పుడు ధ్రువుడు, వినయంగా, వారితో, ‘’నా సోదరుడు ఉత్తముడు, మా తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టాన్ని, పుణ్యంవల్ల పొందాడు. నాకూ ఆ అర్హత కావాలి. మా తండ్రి సింహాసనం, వేరొకరికి దక్కరాదు. ఇది ఇతరుల సింహాసనం కంటే ఉన్నతమైంది. అది ఇంద్రాదులకు కూడా, పొందరానిది. మా తండ్రి వదిలిన సింహాసనం కాదు నాకు కావాల్సింది. నా బలం చేత సాధించుకొన్న సింహాసనం నాకు కావాలి. అది నాకు ఎలా వస్తుంది? దాని సాధనకు నేనేమి చేయాలి? ‘’అని ప్రార్ధించాడు.
💫 అప్పుడు వారిలో మరీచి మహర్షి ‘’శ్రీ మన్నారాయణుని భజించకుండా, ఆ యోగ్యత రాదు" అన్నాడు. అంగీరసుడు, ‘’ఈలోకంలో సంపదను
అనుభవించాలంటే, కమలాక్షుని సేవించాల్సిందే" ‘అనగా, పులస్తుడు ‘’ఎవరిని స్మరిస్తే, సమస్త పాపాలు నశిస్తాయో, అతడే మహా విష్ణువు ‘’ అని , పులహుడు ‘’ఎవని మాయచేత అంతా ప్రవర్తిస్తోందో, ఆ అచ్యుతుడే సర్వాన్ని ఇస్తాడు" అని, క్రతువు, ‘’ఈ జగాలకు ఎవరు అంతరాత్మయో, ఆ విష్ణువు సంతోష పడితే, ఇవ్వనిది ఉండదు ‘’అని వసిష్ఠ మహర్షి, ‘’ఎవరి కనుబొమల అజ్ఞచేత అష్ట సిద్ధులు ప్రవర్తిస్తాయో , ఆ హృషీకేషుని ఆరాధించు ‘’అని, అందరు, విష్ణువే ఏదైనా
[11/16, 04:45] +91 73963 92086: ఇవ్వ గల సమర్ధుడని, బోధించారు.
💫 అప్పుడా ధ్రువబాలుడు, ‘’మహర్షి సత్తములారా !నిలబడినా, నడుస్తున్నా ,
పడుకొన్నా , నిద్రిస్తున్నా ,
మేలుకొన్నా కూర్చున్నా ,
ఎప్పుడూ నారాయణుడిని స్మరించాలి. ద్వాదశాక్షరీ మంత్రం, వాసు దేవాత్మకం. ఆ జపంతో శ్రీమన్నారాయనుని జపించి, నేను నా కోర్కెను తీర్చు కొంటాను. ఆయన మనసు కరగిస్తాను. ఈ మంత్రాన్ని పూర్వం బ్రహ్మ, మునులు, ఉపాసిoచారని తెలుస్తోంది" అన్నాడు. మహర్షులు, ద్వాదశాక్షర మంత్రంతో వాసు దేవుడిని ప్రసన్నం చేసుకోమని సలహానిచ్చి, మనస్పూర్తిగా ఆశీర్వదించి, అంతర్హితులయ్యారు.
💫 ధ్రువుడు వాసుదేవ మనస్కుడై, తపస్సు చేసుకోవ టానికి, అక్కడి నుండి, బయల్దేరాడు.
🙏 *...కాశీఖండం సశేషం....*🙏
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 🙏
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*
🕉️⚜️🔱⚜️🔱🔱⚜️🔱⚜️🕉️
No comments:
Post a Comment