Friday, November 25, 2022

పిప్పలాద మహర్షి గురించి తెలుసుకుందాము..

 Shobha Rani:
Shobha Rani:
🎻🌹🙏 మన మహర్షుల చరిత్రలు..

🌹🙏ఈరోజు 47 పిప్పలాద మహర్షి గురించి తెలుసుకుందాము..🌹🙏

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿మనం తెలుసుకోబోయేది పిప్పలాద మహర్షి గురించి . ఈ పేరు గమ్మత్తుగా ఉంది కదూ . ఇది ఎందుకు వచ్చిందో మీకు చక్కగా చెప్తాను . 

🌸అసలు మహర్షులు సుఖం చూసుకోరు . ఎక్కడోక్కడ ఎలాగోలా బ్రతికేస్తారు . వాళ్ళకి కావలసిందల్లా లోకకల్యాణం .
అంటే అందరూ బాగుండాలని .

🌿చ్యవన మహర్షి సుకన్యలకి పుట్టిన వాడు దధీచి మహర్షి . దధీచి మహర్షి సువర్చలకి పుట్టినవాడు పిప్పలాదమహర్షి . దేవతలు దధీచిని ఎముకలు కావాలని అడిగితే యోగాగ్నిలో శరీరాన్ని ఆహుతి చేసుకుని ఇచ్చేశాడు దధీచి మహర్షి .

🌸దేవతలు ఆ ఎముకలో బ్రహ్మచక్రం , వజ్రాయుధం చేసుకుని రాక్షసుల్ని చంపేశారు . అప్పటికి సువర్చల గర్భవతి .

🌿దధీచి మరణించగానే తనుకూడా దేవతలు వద్దని చెప్తున్నా వినకుండా సహగమనం చేసింది 

🌸సువర్చల ఆసమయంలో కడుపులో ఉన్న పిల్లవాడు ఒక పిప్పలచెట్టు క్రింద పడిపోయాడు . పిప్పలచెట్టు చంద్రుణ్ణి అడిగి అమృతం తెచ్చి పిల్లాణ్ణి పెంచింది . ఆ పిల్లవాడే మన పిప్పలాద మహర్షన్న మాట . 

🌿పిప్పలచెట్టు పెంచింది కాబట్టి పిప్పలాదుడు అని పేరొచ్చింది . అమృతం తాగాడు కనుక ఆకలి , దాహం లేవు . పిప్పలాదుడు ఆ చెట్టే ఆశ్రమంగా తపస్సు చేసుకుంటూ గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడు .

🌸అతనికి మనసులో దేవతల మీద కోపం . ఎందుకంటే అతని తల్లిదండ్రులు మరణించడానికి కారణం వాళ్ళే కదా ! ఒకసారి చంద్రుణ్ణి నా తల్లి దండ్రుల్ని చంపిన దేవతలందర్నీ నాశనం చెయ్యాలి ఉపాయం చెప్పమన్నాడు . 

🌿శివుణ్ణి గురించి తపస్సు చెయ్యి , ఆయన ఎలా చెప్తాడో అలా చెయ్యమని చంద్రుడు పిప్పలాదుడికి చెప్పాడు . పిప్పలాదుడు శివుడి గురించి ఘోరతపస్సు చేశాడు . 

🌸శివుడు ప్రత్యక్షమై ఏంకావాలనడిగాడు . స్వామీ ! నాకు నా తల్లిదండ్రుల్ని చంపిన దేవతలందర్నీ నాశనం చెయ్యాలని ఉంది .

🌿ఎందుకంటే తల్లిదండ్రుల వియోగం , అదీగాక కళ్ళు తెరవని పసిగుడ్డుని నాకెంత బాధగా ఉంటుందో మీకు తెలుసుకదా ! అందుకే అడిగానన్నాడు పిప్పలాదుడు .

🌸నాయనా ! నీ తల్లిదండ్రుల్ని చూసుకునే శక్తినిస్తాను . దేవతల్ని చంపడం మంచి పనికాదు . అయినా పుట్టినవాళ్ళు ఎప్పటికైనా మరణించక తప్పదు కదా ! అని స్వర్గలోకానికి వెళ్ళే శక్తినిచ్చాడు శివుడు .

🌸తల్లిదండ్రుల్ని చూసి వాళ్ళు చెప్పినవి విని ఆశీర్వాదం తీసుకుని తన ఆశ్రమానికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడు పిప్పలాదుడు .

🌸కాంతకాలం తర్వాత పిప్పలాదుడికి పెళ్ళి చేసుకోవాలనిపించింది . ఒకనాడు అనవన్యరాజు కూతురు పద్మని చూసి ఆమెని చేసుకోవాలనుకున్నాడు . అనవన్య రాజు విష్ణు భక్తి కలవాడు .

🌿ఇంద్రపదవిని కూడా వద్దని వదిలేసినవాడు . పిప్పలాదుడు అనవన్యరాజుని అతని కూతురు పద్మనిచ్చి పెళ్ళి చెయ్యమని అడిగాడు . ఆ రాజుకి వందమంది కొడుకులు , ఒక్కతే కూతురు .

🌸మునికి తన కూతుర్ని ఎలా ఇవ్వడమా అని ఆలోచించాడు . కులగురువు రాజుకి పిప్పలాదుడు మహాయోగి దధీచికి కొడుకు , నువ్వేమి ఆలోచించకు . ఇతడు కూడ మహాతపశ్శక్తి ఉన్నవాడు .

🌿నీ కూతురు సుఖపడ్తుందని చెప్పాక పద్మనిచ్చి పిప్పలాదుడికి పెళ్ళి చేశాడు . 
తేజస్సుతో వెలిగిపోతున్న పిప్పలాదుడు , అందగత్తె పద్మ చూడముచ్చటగా వున్నారు .

🌸పద్మ గొప్ప పతివ్రత , భర్తకి సేవచేస్తూ ఆశ్రమంలో వుండిపోయింది . ధర్మదేవత పద్మని పరీక్షించాలని 
ఈ జడలు కట్టిన మహర్షితో ఏం బ్రతుకుతావు . నీ అందానికి తగ్గట్టుగా మాతో వుండాలి నువ్వు అన్నాడు .

🌿పద్మ కోపంతో నీ చివరికాలంలో నాశనమయిపోతావని శపించింది . ధర్మదేవత నిజస్వరూపంలో కనిపించి నిన్ను పరీక్షించడానికి ఇలా అన్నాను కాని నిజంగా కాదని శాపవిమోచనం చెయ్యమని అడిగాడు పద్మని . 

🌸శాపం అనుభవించక తప్పదని కలియుగంలో ఒంటి పాదంతో ఉండి మళ్ళీ కృతయుగం వచ్చేసరికి పరిపూర్ణంగా నాలుగు పాదాల్తో వుంటావని చెప్పింది పద్మ . 

🌿నీభర్త మార్కండేయుడి కంటే ఆయుషు , కుబేరుడి కంటే ఎక్కువ ధనం , కపిలుడి కన్నా గొప్ప ఋషి , శివుడితో సమానంగానూ నిత్య యౌవనంతోనూ ఉంటాడని దీవించాడు పద్మని ధర్మదేవత . 

🌸పద్మ భర్తకి జరిగిందంతా చెప్పింది . పిల్పలాదుడు భార్యని ఎంతో గౌరవించాడు . వాళ్ళకి అయిదుగురు కొడుకులు పుట్టారు . పిప్పలాదుడు తపస్సుతో కాలం గడుపుతూ తన దగ్గరికి వచ్చిన వాళ్ళ సందేహాలు తీరుస్తున్నాడు . 

🌿ఒకనాడు పిప్పలాద మహర్షిని చూడ్డానికి కాత్యాయన మహర్షి సంతతి వాడు కబంధుడు ,భృగువంశం వాడు వైదర్భి , అశ్వలాయన వంశం వాడు కౌశల్యుడు , గర్గ మహర్షి వంశం వాడు సౌర్యాయనుడు , సత్యకాముని వంశం వాడు శైభ్యుడు , భరద్వాజుడి వంశం వాడు సుకేశుడు మొదలైన గొప్ప వాళ్ళందరూ వచ్చి వాళ్ళ సందేహాలు ఇలా అడిగారు . 

🌸సృష్టి ఎలా జరుగుతోంది ? అని అడిగితే మహాత్మా ! చంద్రుడు సూర్యుడు కలిసి నడిపిస్తున్నారు . సూర్యుడే ప్రాణం . ప్రాణాగ్నులు ఇతని నుంచే పుడ్తున్నాయి .

🌿పరబ్రహ్మ పురుషుడుగా అంతర్ముఖంలో కర్మసాక్షిగానూ , బహిర్గతంలో కాలస్వరూపుడుగానూ మొత్తం ప్రపంచాన్ని నడుపుతున్నాడు . కాలస్వరూపం అంటే దక్షిణాయనంలో చంద్రమండల ప్రాప్తి , ఉత్తరాయనంలో బ్రహ్మలోకప్రాప్తి కలిగిస్తున్నాడు .

🌸మొదటి దానికి యజ్ఞయాగాదులు బావులు , చెఱువులు తవ్వించడం లాంటివీ , రెండోదానికి బ్రహ్మచర్యం శ్రద్ధాభక్తులు ఆత్మజ్ఞానం వుండాలి అని చెప్పాడు పిప్పలాదుడు . సంవత్సరానికి పన్నెండు మాసాలుంటాయి . 

🌿మాసం ప్రజాపతి స్వరూపం .శుక్లపక్షం ప్రాణస్వరూపం .పురుషుడి శుక్రం స్త్రీ శోణితంతో కలిసినప్పుడు ప్రజాసృష్టి జరుగుతుంది .కానీ , ఇది రాత్రి భాగంలోనే కాని , పగటి భాగంలో జరిగితే ఆయువు తగ్గిపోతుంది .

🌸ఈ శరీరాన్ని భరించే వాళ్ళు ఎవరు ? ప్రకాశింప చేసేవాళ్ళు ఎవరు ? అందులో గొప్ప వాళ్ళెవరు ? అని అడిగారు మహర్షులు . 

🌿ప్రాణం శరీరాన్ని నిలబెడుతుంది , ప్రకాశింప చేస్తుంది కూడా . ఇంద్రియాలు ఇది ఒప్పుకోలేదు . మేమే నిలబెడతున్నామన్నారు . కాని ప్రాణం పోగానే ఇంద్రియాలు పోతున్నాయి కదా .తుడే ప్రాణరూపంలో శరీరంలో ఉన్నాడు కనుక ప్రాణమే శ్రేష్ఠమైంది కూడా అన్నాడు పిప్పలాద మహర్షి .

🌸ఇంకా ఇలా అడిగారు మహర్షులు . ప్రాణం ఎలా పుడుతుంది ? శరీరంలోకి ఎలా వెళ్ళి , విభజించబడ్తుందని ?

🌿ఆత్మనుంచే ప్రాణం పుడ్తుంది . మనిషి కోరడాన్ని బట్టి శరీరంలో ప్రవేశించి ప్రాణం , ఆపానం , వ్యానం , ఉదానం , సమానం అని అయిదు భాగాలుగా విభజించబడుతుంది . 

🌸ప్రాణం పంచేద్రియాల్లో వుంటుంది . అపానం పనికిరాని పదార్థాల్ని బయటకి పంపిస్తుంది . సమానం తిన్న పదార్ధాల్ని జీర్ణం చేస్తుంది . 

🌿వ్యానం గుండెనుంచి బయల్దేరి నూట ఒక్కనాడులు ఒక్కొక్కటి డబ్బయి రెండు వేలుగా మారి శరీరమంతా వ్యాపించడానికి ఉపయోగిస్తుంది .

🌸ఉదానం మనిషి చేసిన పాపపుణ్యాలని బట్టి జీవుడ్ని పై లోకాలకి తీసుకువెడుతుంది . ఇవన్నీ తెలుసుకుని నడుచుకుంటే మనిషికి ఎప్పుడూ మరణించాలనుకుంటే అప్పుడు ఏలోకానికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళచ్చు అన్నాడు

🌿పిప్పలాద మహర్షి మహాత్మా ! " నిద్రించేది మేల్కొనేది ఏమిటి ? సుఖమెలా వస్తుంది ? ” అని అడిగారు మహర్షులు . 

🌸పిప్పలాదమహర్షి “ ఇంద్రియాలన్నీ మనస్సుతో కలిసి బైటకి వెళ్ళడాన్ని మహర్షులు నిద్ర అంటాము . " అన్నీ కలిసి పరమాత్మలో లీనమవడం వల్లే సుఖం కలుగుతుంది ” అని చెప్పాడు .

🌿దేవా ! ఆఖరివరకూ ఓంకారం ఉపాసించినవాడు ఏలోకానికి వెడతాడని అడిగారు మహర్షులు .

🌸రోజుకి ఒక్కసారి ఓంకారం ఉపాసిస్తే మనిషిగా పుడతారు . రెండుసార్లు చేస్తే చంద్రమండలం చూసి వచ్చి నర లోకానికి వెడతారు . మూడుసార్లు చేస్తే సూర్యమండలంలోంచి బ్రహ్మలోకానికి వెడతారు . 

🌿శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ప్రాణం నుంచి శ్రద్ధ , ఇంద్రియాలు , శరీరం , అన్నం , వీర్యం అన్నీ కలిసి మనిషిలో నామ రూప రుచి భేదాల్లేకుండా కలిసిపోతున్నాయి . 

🌸అలాంటి వాడే షోడశకళాపురుషుడు లేకపోతే అమృత స్వరూపుడు అంటారని చెప్పాడు పిప్పలాద మహర్షి పిప్పలాదుడు ఇంకా ఇలా చెప్పాడు .

🌿శరీరం పంచభూతాలో తయారయింది . శరీరంలో గట్టిగా ఉండే చోటుని పృథివి అని , ద్రవ ప్రదేశాన్ని జలమని , వెచ్చగా ఉండే ప్రదేశాన్ని తేజమని , సంచరించేదాన్ని వాయువని , ద్వారమై ఉండేది ఆకాశమని అంటాం . 

🌸ఇంకా రసం నుండి రక్తం , రక్తం నుంచి మాంసం , మాంసం నుంచి మేధస్సు , మేధస్సు నుంచి ఎముకలు , ఎముకల నుంచి మజ్జ , మజ్జ నుంచి పురుషుడి శుక్లం , శోణితం ఉంటున్నాయి . 

🌿వీటి కలయికవల్లే మనిషి పుట్టుక జరుగుతుంది . ఈ విధంగా మనిషి ఎలా పుడతాడు ? ఎలా బ్రతకాలి ? మన మరణం మన చేతిలో ఎలా వుంది ? అసలు ప్రాణం అంటే ఏమిటి ? ఓంకారం వల్ల ఏలోకాలకి వెళ్ళచ్చు ? అనేవన్నీ చెప్పాడు పిప్పలాద మహర్షి . 

🌸ఆయన గ్రంథాలు “ గర్భోపనిషత్తు ” , “ పరబ్రహ్మోపనిషత్తు . ” 
ఇదండీ పిప్పలాద మహర్షి కథ చరిత్ర రేపు మరెన్నో విశేషలతో మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment