చేతులు రెండూ కట్టేసి సంకెళ్లు వేసి...పైకి లాగి..కాళ్ళు ముని వేళ్ళు భూమికి ఆనేట్టు మాత్రమే ఉంచి..
రోజూ తొమ్మిది గంటలు వారం బాటు నిలబెట్టి... ఉంచేసే క్రూరమైన శిక్షను అనుభవించింది..సావర్కర్...నెహ్రూ కాదు..
యాభై ఏళ్లు కాలాపానీ జైలు పడింది...సావర్కర్ కు...నెహ్రూకు కాదు...
ఉచ్చ పోసుకున్న చోటే... దొడ్డికి కూచున్న దగ్గరే తిండి తినాల్సిన జైల్లో ఉన్నది...సావర్కర్..నెహ్రూ కాదు..
గది పై భాగంలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా మాత్రమే సన్నని వెలుగు కనపడే చీకటి కొట్టంలో మృగ్గి పోయింది...సావర్కర్..నెహ్రూ కాదు...
పాచి పోయిన జొన్న రొట్టె రేకుల్లా గట్టిగా ఉండి గొంతు దిగని నాలుగు నాలుగు ముక్కలు.. సంవత్సారాలు తరబడి తిన్నది...సావర్కర్..నెహ్రూ కాదు...
భీకరమైన గుహల్లో..ఖైదీల భయానక మైన నవ్వుల్లో...ముఖం దాచుకుని దుఃఖమే అసహ్యించుకున్న దుఃఖం అనుభవించింది... సావర్కర్..నెహ్రూ కాదు...
కాళ్లూ చేతులూ ముడుచుకున్నా సరిపోని డబ్బాల్లో కూర్చో పెట్టీ...
తరలింపబడిన ఘోర శారీరక హింస బ్రిటిష్ వారి చేతుల్లో అనుభవించింది... సావర్కర్...నెహ్రూ కాదు...
మూడంటే మూడే ముంతలతో...వంగమన్నప్పుడు ఒంగి లేవమన్నప్పుడు లేచే స్నానం చేసింది...సావర్కర్... నెహ్రూ కాదు..
గంటల కొద్దీ బురదను ఎత్తి పోయించి...బొక్కలు చూర చూర చేసినా మట్టి చాటున కప్ప బడి పోయి...
కనబడని కౌకు దెబ్బలు తిన్నది... సావర్కర్...నెహ్రూ కాదు...
హఠం చేసి చావద్దు..దొంగ సత్యాగ్రహాలు వద్దు అని...తోటి ఖైదీలకు చెప్పి...తిని శక్తి సంపాదిస్తే కదా..
ఆ కుక్కలను కొట్ట గలిగేది అని ప్రేరణ ఇచ్చింది సావర్కర్..నెహ్రూ కాదు...
వంద డిగ్రీల వేడిలో...రక్త విరేచనాలు...అజీర్ణం తో చిక్కి శల్యం అయిపోయి..కళ్ళు గుంటలు పడి..కాళ్ళు సత్తువలేక నేలకంటినది... సావర్కర్ కు..నెహ్రూకు కాదు...
ఈయన్ని బ్రిటిష్ తొత్తు అనేవాడు...ఒకసారి ఏదైనా ప్రభుత్వానికి సమర్థన గా అయినా... ఓ నెల జైల్లో ఉండి రా...తెలుస్తుంది...
రక రకాల వ్యూహాల్లో..ఆలోచనల్లో...ప్రభుత్వాలకి ఏదో ఒకటి వ్రాసి...యుద్ధానికి సిద్ధం అవుతుంటారు...
వాటన్నిటినీ చూపించి... తుచ్ఛ నీచ రాజకీయాలు మాట్లాడానికే నీ చరిత్ర పనికొస్తుంది...
సావర్కర్ ఎవరో మాకు తెలుసు...
హిందుత్వం గురించి మాట్లాడాడు అనే కదా ఇంత కచ్చ....
ఆయన చెప్పిన వాటిల్లో దేశానికి అవసరం లేనివి ఉంటే...మేము చూసుకుంటాము...
ఈ దేశానికి..ధర్మానికి అంగుళం కూడా చెందని కలగూర గంపవి...
నువ్వు చూపించే కాగితాలు చూసి చరిత్ర తెలుసుకునే ఖర్మ పట్టలేదు...
నడిస్తే నడు... పరిగెత్తితే పరిగెత్తు... పడుకుంటే పడుకో...
జోడో కోసమో..జోడీ కోసమో...నీ యాత్ర నువ్వు చేసుకో...
తెలుసున్నదే మాట్లాడు...తెలియనిది...వద్దు..
నీ తాత ద్రోహాలు మళ్ళీ గుర్తు చేసుకుని వాంతి చేసుకునేలా...విషయాలు కెలకకు...
ఇన్ని కిలోమీటర్లు నడిచింది....దేశాన్ని విడగొట్టడానికి అన్నది ప్రజలకు అర్థం అయిపోతుంది...
చైనా పోయి కాగితాలు వ్రాసుకో...
అందుకే నీదీ....
దేశాన్ని ముక్కలు చేసిన నీ ముత్తాతది ఫోటో కూడా ఆ మహనీయుడి పక్కన పెట్టట్లేదు...
జై హింద్!!!
No comments:
Post a Comment