Saturday, November 19, 2022

 *డబ్బును సంపాదించి మనిషి నిరుపేదగా మిగిలిపోవడమే* - ఈ శతాబ్దపు పతాక శీర్షిక .


 *చుట్టూ జల ప్రవాహాలే... తాగడానికి యోగ్యం కాకుండా!* 


 **చుట్టూ గాలి కెరటాలే- పీల్చడానికి పనికిరాకుండా* ! మనిషి శతాయుష్మంతుడయ్యాడు.

 *ఒంటిమీద జీవకళ లేకుండా! ఏకాకిగా మిగిలి ఉన్నాడు* 


చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిది?’ అన్న మహాకవి *శ్రీశ్రీ* ప్రశ్నకు బదులివ్వాలంటే- పరువు కరవవుతుంది, గుండె చెరువవుతుంది.


 కలిసొచ్చింది ఎంతయ్యా ఈ సౌభాగ్యం అమ్మేశాకా?’ అని ఎవరైనా అడిగితే మనం చెప్పగలిగిన సమాధానం ఒక్కటే- *‘నీరు కొని త్రాగుటెన్నడో నేర్చినాము!’* 


ముద్దొస్తున్న బుజ్జి మేకపిల్ల... పెద్దయ్యాక నీ పంటికింద మాంసం ముక్క’ అన్నాడు కరచాలనమ్‌ *కవి పెమ్మరాజు.*

 మానవ నైజానికి మధుకశ(తీపి దెబ్బ) లాంటి మాట అది.


 పశుపక్ష్యాదుల్లో దేన్ని సాకినా- మనిషి స్వార్థం కోసమే తప్ప, మానవ పరివారంలో అవీ భాగమేనన్న భావనతో కానే కాదు. 

బాదం పిస్తాలు పెట్టి పందెం కోళ్లను బలిష్ఠంగా మేపుతాడు మనిషి- కోడిమీద ప్రేమతో కాదు, గెలుపుమీద కసితో! ఆధునికత, అభివృద్ధి వంటి అందమైన మాటల చాటున మనం- ‘అడవుల నరికేసినం... *పక్షుల తరిమేసినం... చెట్లను కూల్చేసినం... నేల విడిచి సాము లెక్క దురాక్రమణ చేసినం...’ అనేది చేదు నిజం.* 


 పశువులు, పక్షులు నిజానికి మనిషికి చేసే సేవ ఇంతా అంతా కాదు. ‘పక్షియే శ్రీరామ పథము నిర్దేశించె(జటాయువు), పక్షియే శ్రీహరి వాహమయ్యె(గరుత్మంతుడు)’ అంటూ ఆరంభించి, ఉడుత సాయం దాకా కవులు ఎన్నో విషయాలను ప్రస్తావించారు.


 పశుపక్ష్యాదుల చేత మాటలాడించారు. వాటి సాయంతో రాయబారాలు నడిపించారు. అవన్నీ ఈ సృష్టిలో భాగమేనన్న స్పృహను రేకెత్తించారు.


 ‘దుర్వ్యాపారమ్ములు మానకున్న మిముగావన్‌ లేరు బ్రహ్మాదులున్‌’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. మనిషి వాటిని పెడచెవిన పెట్టాడు. పంచభూతాలను సైతం అంగడి సరకులు చేశాడు. 

 పంచభూతాల అండ లేకుండా! కారణం ఒక్కటే... నాగరికతకు అర్థం తెలియక మనిషి ప్రకృతి నుంచి విడిపోయాడు, చెడిపోయాడు.

 
‘తేలిక గడ్డిపోచలను తెచ్చి రచించెదవీవు తూగుటుయ్యేల గృహంబు, మానవులకు ఏరికి సాధ్యము కాదు- దానిలో జాలరులు.


 అందులో జిలుగుశయ్యలు అంతిపురంబులు... పులుంగు ఎకిమీడవు (చక్రవర్తివి)రా గిజిగాడ’ అంటూ పిచ్చుకల మీద *జాషువా* శైలిలో కవిత రాయాలనుకొంటే- అసలు పిచ్చుకలేవీ? *శేషేంద్రశర్మే* జీవించి ఉన్నా- ‘సంపెంగ ముక్కును సవరించి పిచ్చుక జలతరంగిణి మీటె శ్రావ్యసరణి’ అంటూ మురిసిపోయే అవకాశం ఈవేళ ఉందా?


 ‘ప్రొద్దుటింతలు వాయువులు తావికై మెల్ల కొతిమీర చేలపై కొసరులాడె’ అని *విశ్వనాథ* వర్ణించిన ఆకుపచ్చని అందాలు, *వేదులకవి* ఊరించిన ‘మలయానిలు కౌగిట పుల్కరించు సౌఖ్యానుభవమ్ము’ ఇప్పుడు పుస్తకాల్లో చదువుకోవలసిందే.


 ఈ నేపథ్యంలో ‘చుట్టూ ఆవరించిన చీకటిని తిట్టుకొంటూ కూర్చోవడం కన్నా- ఒక్క చిరుదీపాన్ని వెలిగించడం మేలు’ అన్న *కాళోజీ* సూక్తిని ఆచరణలోకి తెచ్చారు.

No comments:

Post a Comment