Thursday, November 24, 2022

🍁ఆచరణ*🍁

 *🍁ఆచరణ*🍁

✍️ మురళీ మోహన్ 
👌  ఒకానొక ఊరిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలక వుంది. అది తన పిల్లలు పెద్దవవుతుండడంతో బయటకువెళ్లి ఏదైనా అపాయంలోపడతాయేమోనని భయపడి, ఒకరోజు రెపరేపా రెక్కలుకొట్టుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్ని చూసి పిల్లలారా.., రండి మీకొక మంచి పాట నేర్పిస్తాను. అంది.
 సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన పిల్లలకు, 
👉 వేటగాడొస్తున్నాడు జాగ్రత్త..! 

👉గింజలు విసురుతాడు జాగ్రత్త..!
👉 వలవేస్తాడు జాగ్రత్త..!
👉 పట్టుకుంటాడు జాగ్రత్త..!
👉 మెడ విరుస్తాడు జాగ్రత్త.. ! 
*అనే పాటనేర్పింది.*

అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చేసుకున్న ఆ పిల్లలు బహురమ్యంగా పాడటం మొదలుపెట్టాయి. హమ్మయ్యా..! వేటగాడొచ్చినా నా పిల్లలకి ఇంకేం పరవాలేదు. అనుకొని వేటకొరకు అడవులలోకి తుర్రున వెళ్ళిపోయింది ఆ తల్లి చిలుక.

ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే చిలుక పిల్లలు వేటగాడొస్తున్నాడు జాగ్రత్త..! అని పాడసాగాయి. అది విన్న వేటగాడు హడలిపోయి చెట్టుచాటున నక్కి పోనీ గింజలు విసిరిచూద్దాం.. అని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త..! అని పాడసాగాయి. ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏంచెయ్యాలో అర్ధంకాక వలవేసాడు. ఈలోగా వలవేస్తాడు జాగ్రత్త..! అని పాడుతూ ఆ చిలుకలు అతడు విసిరిన వలపై వ్రాలాయి. పాడుకుంటూ గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కక్కటిగా పట్టుకొని మెడవిరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ చిలుకలు మెడ విరు...స్తా......డు........ అంటూనే చచ్చిపోయాయి.

అయ్యో... ఈ చిలుకలు పాట అయితే నేర్చుకున్నాయి గాని, దానిలోని అర్ధాన్ని గ్రహించుకోలేదు. 

మన పిల్లల చదువులు కూడా ఇలాగే వున్నాయి. పిల్లలే కాదు మనమందరము కూడా

 నేడు  మన మందరమూ చక్కని దేవుని శ్లోకాలు, పాటలు, మంత్రాలు, పురాణాలు, ప్రవచనాలు, వేదాలు, సహస్రనామాలు, వింటున్నాము, చదువుచున్నాము. పాటించ(ఆచరించ) కుండా వదిలేస్తున్నాము.  నాకు తెలిసి దేముడు, or, ఋషులు  వాటిని పాటించ (ఆచరించ) మన్నారు గాని 11 సార్లు చెయ్యి, మండలం చెయ్యి, లక్ష సార్లు చెయ్యి అని ఎక్కడా చెప్పినట్లు లేదు . అవి మనం సృష్టించు కున్నవి.
 మనలాగే చిలక పిల్లలు బాగా పాడటం నేర్చుకున్నాయి గాని అర్థాన్ని గ్రహించక పాపం చనిపోయాయి.🤔

No comments:

Post a Comment