Saturday, November 12, 2022

జీవన నిత్య సత్యాలు

 🎡జీవన నిత్య సత్యాలు🎡


⭕అపజయాలు తప్పులు కావు... అవి భవిష్యత్తు పాఠాలు💯

⭕ఏదైనా తనంతట తాను నీ దరిచేరదు.. ప్రయత్న పూర్వకంగా సాధిస్తేనే విజయం సొంతమవుతుంది💯

⭕కాలాన్ని వృథా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే💯

⭕చిరునవ్వును మించిన అందం, వినయాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు💯

⭕ఈ ప్రపంచం బాధ పడేది చెడ్డవారి హింసవల్ల కాదు, మంచివారి మౌనం వల్ల 💯

⭕కుండెడు బోధనల కంటే గరిటెడు ఆచరణ మేలు💯

⭕ఏ అర్హత మనకుంటే అదే లభిస్తుంది💯

⭕విజ్ఞానం మనల్ని శక్తిమంతుల్ని చేస్తే, మంచి వ్యక్తిత్వం మనపై గౌరవం కలిగేలా చేస్తుంది💯

⭕స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనమే మిన్న 💯

⭕చేసేది చిన్న పనైనా శ్రద్ధగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది💯

✒️సేకరణ
💞విప్పోజు శ్రీనివాస చారి విశ్వకర్మ 💕

No comments:

Post a Comment