Sunday, November 27, 2022

అన్వేషణ

 అన్వేషణ

జనకుడుకి ఒక రోజు రాత్రి కలలో తాను బిక్షకుడిగా
ఉన్నట్టు, ఎంత యాచించిన
ఎవరు బిక్షం వేయకపోయేసరికి ఆకలి మంటతో
చనిపోతనేమో అని ఏడుస్తున్నట్టు కల వస్తుంది,

అప్పుడు వెంటనే జనకుడు మేల్కొని కళ్ళు తెరిచి
చూసేసరికి బంగారు మంచం మీద
పడుకునిఉంటాడు, ప్రక్కన సేవకులు పళ్ళు,
పాలు ఉంటాయి. మహారాజు కదా...అతను...!
అప్పుడ జనకుడికి సందేహం కలుగుతుంది,

అదేంటి? నేను ఇంత గొప్ప రాజుని, ఇంత సంపద
ఉంది, తినడానికి ఇన్ని పదార్థాలు ఉన్నాయి, ఐన కలలో
నేను ఎందుకు తిండి లేక ఏడ్చాను అని
సందేహం కలుగుతుంది.

ఎవరక్కడా అని భటులను పిలిచి చాటింపు వేయించి, బ్రాహ్మణులను, పండితులను, అందరిని పిలిచి ఈ ప్రశ్న అడుగుతాడు...”నేను రాజుని ఐతే అక్కడ ఎందుకు తిండి లేక ఏడ్చాను? అది నిజామా? ఇది
నిజామా? ఇది నిజం ఐతే నా కలలో ఈ పళ్ళు, పాలు,
సేవకులు ఎందుకు రాలేదు?” అని ఎవరు సరిగ్గా
సమాధానం చెప్పరు,

అప్పుడు జనకుడు సమాధానం చెప్పని వాళ్ళని
చెరసాలలో పెట్టండి అని ఆదేశిస్తాడు. అలా
ఆయనకు పిచ్చెక్కిపోతుంది సమాధానం దొరక్క...!

అప్పుడు అష్టావక్రుడు ప్రవేశిస్తాడు, ఆయన్ని
చూడగానే ఎనిమిది వంకర్లతో ఉన్నాడు ఈయనేమి
సమాధానం చెప్తాడు అని అందరు నవ్వుతారు.

జనకుడు మాత్రం కాళ్ళకు నమస్కరించి తన ప్రశ్న
అడుగుతాడు. నేను సమాధానం చెప్తాను కానీ
ముందు చెరలో ఉన్న వాళ్ళను వదిలిపెట్టు అని
అంటాడు అష్టావక్రుడు, తక్షణమే
వదిలిపెడతాడు జనకుడు.

అప్పుడు అష్టావక్రుడు ఇలా చెప్తాడు...రాజా..! ఆ
కలలో బిక్షం కోసం ఎదురు చూసి బాధ పడింది
మీరు కాదు, అలానే
ఇప్పుడు సమాధానం కోసం ఇంత మందిని చెరలో
వేసి నన్ను అడిగేది నీవు కాదు, కల ఎంత
అసత్యమో....ఇది కూడా అసత్యమే, అది బ్రమ
అయితే ఇది కూడా బ్రమే అని చెప్తాడు.

అప్పుడు జనకుడు...నేను ఎవరు అని
అడుగుతాడు, చెప్తే నాకు గురుదక్షిణగా ఏమి
ఇస్తావు అని అడుగుతాడు అష్టావక్రుడు.
రాజ్యాన్ని ఇస్తాను అంటాడు జనకుడు. బ్రమలో
ఉన్న రాజ్యం నాకెందుకు? నీ మనసు కావాలి అది
ఇవ్వు అని అంటాడు అష్టావక్రుడు, సరే అని
మనసుని గురుదక్షిణగా ఇస్తాడు జనకుడు.

(నీతి:- కలలు అందరికి వస్తాయి కానీ
అందరు తేలిగ్గా తీసుకుంటారు, కానీ
జనకుడు ఎంత పట్టుదలతో ఆలోచించాడో చూసారా?
ఒక సందేహం నుండే అతనికి ఒక జ్ఞాని లబించాడు,
ఆ సంధహమే అతన్ని జ్ఞానిని చేసింది, అందుకే
సందేహాన్ని ఎప్పుడు నివృత్తి చేసుకోవాలి..

🔹🔸🔹🔸🔹🔸💕

No comments:

Post a Comment