🪔ఓం త్రయంబకం యజామహే సుగంధిం
పుష్టివర్ధనం ఊర్వారుకమివబంధనాత్
మ్రుత్యోమ్రుక్షీ యమామ్రుతాత్
🪔ఓం నమః శివాయ సిద్దం నమః
🪔ఓం శ్రీ సతియేనమః
🌺ఒడ్డున దొరికే వాటికోసం ఆరాటపడకు🌺
🎈 ఒక అతను సముద్రము దగ్గర దొరికే రంగు రంగు రాళ్ళని ఏరుకొని వాటిని సముద్ర తీరప్రాంతానికి దూరముగా ఉండే తన స్నేహితులకి అమ్మడం లేదా ఉచితముగా ఇవ్వడం చేస్తుండేవాడు. అలా కొన్ని సంవత్సరములుగా చేస్తుండేవాడు కాని ఎప్పుడు ఇదే పని చెయ్యడం ఏమిటి ఈరాళ్లు గత కొన్ని ఏండ్లుగా చూస్తున్నవే కదా కానీ నాకు ఇంతకు మించి మరింత అందముగా ఉండేవి కావాలి అని ఆశించాడు
🍁 అందుకే ఇక సముద్రము దగ్గర ఒడ్డున ఉండే వాటికోసము వెదకడం మానేసి సముద్రములోనికి వెళ్లడం మొదలుపెట్టాడు. అలా అలా లోతుకు వెళ్లడం వలన అక్కడ దొరికే అందమైన రాళ్లను మరింత ధరకి అమ్మడం వాటిద్వారా ఎక్కువలాభం సంపాదించడం చేస్తున్నాడు. అందువలన రోజు రోజుకి ఇంకా ఇంకా సముద్రములోతులకి వెళ్లడం మొదలుపెట్టాడు. అలా వెళ్లిన అతనికి అక్కడ అందమైన ముత్యాలు దొరికేవి వాటితో గత కొన్ని సంవత్సరాలుగా తాను పొందిన లాభముతో పోల్చుకుంటే అనేక రేట్లు అధికమైన లాభమును పొందాడు.
🌹నేడు మనలో అనేకమంది పరిస్థితి కూడా ఇదే గ్రంథాలను కేవలం పైపైన మాత్రమే చదువుతుంటాము. అక్కడ ఉన్న పైపైన విషయాలనే తెలుసుకుంటుంటాము, పైన విషయాలనే తెలుసుకుంటుంటాము. అందుకే తీరము వెంబడి ఒడ్డున దొరికిన రాళ్లతో సంతోషపడి ముత్యములను పొందుకోలేని పరిస్థితిలో ఉన్నాము.
🌷ఎవరైనా మనకి గొప్ప గొప్ప విషయాలను బోధిస్తుంటే లేక వివరిస్తుంటే వీరికి ఎలా ఇంత బాగా తెలుసు, ఎలా ఇంత చక్కగా అన్ని విడమరచి చెప్పగలుగుతున్నారు, ఎలా ఇంత లోతైన విషయాలను అర్ధవంతముగా బోధించడం లేక వివరించగలుగుతున్నారు అని మనకి అనిపిస్తూ ఉంటుంది కారణం వారు గ్రంధాల్ని తీరము వెంబడి ఒడ్డున దొరికే రంగురాళ్ల కోసం వెదకలేదు కానీ లోతులో ఉన్న ముత్యముల కోసం తమ శ్రమను, సమయాన్ని ధారపోయడం చేశారు.
🌷 మనము కూడా ఒడ్డున దొరికే రంగు రాళ్ల కోసం ఆరాటపడక లోతున దొరికే ముత్యాలకోసం ప్రయాసపడి చక్కని జ్ఞానమును సంపాదించుకోవాలి.
లోతుకు వెళ్ళే మార్గమే సరైన సాధన. సాధన ద్వారా సర్వం, సకలం పొందుతారు. ఎలాంటి వ్యయ ప్రయాసలకు లోను కాకుండా ఆత్మ శక్తితో అన్నింటిని చూడగలరు, కావాల్సినవి పొందగలరు. అందుకే పెద్దలు చెబుతారు శ్రద్ధావన్ లభితె.... దేని మీద శ్రద్ద పెట్టాలి అంటే శ్వేస మీద ధ్యాస.. అది కూడా సాధన కుదిరేవరకు మాత్రమే... ఒక ఊత కర్ర లాగా వాడుకోవాలి... అటు తర్వాత ఊత కర్ర ఆటోమాటిక్ గా తొలగి పోతుంది...
పసుపుల పుల్లారావు, ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తెలంగాణా రాష్ట్రం
9849163616
No comments:
Post a Comment