నేటి మంచి మాట .
ఆనందంతో చప్పట్లు కొట్టేటప్పుడు పదివేళ్ళు కలుస్తాయి...గౌరవంతో నమస్కరించేటప్పుడు పదివేళ్ళు కలుస్తాయి...కానీ కన్నీరు తుడుచుకునేటప్పుడు ఒక్క వేలే కదులుతుంది...మన కష్టంలో మన వేళ్లే కలిసిరానప్పుడు ఎవరో ఆదుకోవడానికి రాలేదని బాధపడటం అనవసరం...గొంగలిపురుగు తన జీవితం అయిపోయిందని బాదపడేలోపలే అందమైన సీతాకోక చిలుకలా మారి స్వేచ్చగా ఎగిరిపోతుంది...మనిషి జీవితం కూడా అంతే .కష్టం వచ్చినపుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది...నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంతగా పైకి తీసుకువస్తుందో నేనే అనే అహంకారం మనిషిని అంతగ క్రిoదకి దిగజారుస్తుంది...ఈ క్షణం ఈ రోజే ఈ జీవితం మరుక్షణం ఏమిటో తెలియని సందేహమే జీవితం...
ఉషోదయపు శుభాకాంక్షలు చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment